మనకి రోజు తెలిసిన విషయాలే అయినప్పటికీ కొన్ని కొన్నిటిని మనం పట్టించుకోము. ఆలోచిస్తూ వెళ్తే మన చుట్టూ ఉండే విషయాలని మనం గ్రాంటెడ్ గా తీసుకుంటూ ఉంటాము. అందుకే మన ప్రమేయం ఉండని వాటి గురించి తెలుసుకోవడానికి మనం పెద్దగా ఆసక్తికనబరచము. రోజు చూస్తూ ఉండే అంశాలు మనకి సాధారణం గా బోరు గా అనిపిస్తుంటాయి. ఇది కూడా అలాంటి విషయమే.

answer or reject 2

మనం స్మార్ట్ ఫోన్ ను గత కొన్నేళ్లు గా వాడుతూ వస్తున్నాం. అయినప్పటికీ కొన్ని విషయాలను మనం అస్సలు పట్టించుకోము. ఉదాహరణకి మనకి ఏదైనా కాల్ వచ్చింది అనుకోండి. మనకి ఇష్టమైతే ఆన్సర్ చేస్తాం.. లేదంటే రిజెక్ట్ చేస్తాం. అంతే గాని ఆన్సర్ బటన్ గ్రీన్ కలర్ లో ఎందుకు ఉంది.. రిజెక్ట్ బటన్ రెడ్ కలర్ లో ఎందుకు ఉంది అని మాత్రం ఆలోచించము. నిజానికి అవి ఆ రంగుల్లో ఉండడం వల్లనే మనం చూడగానే గుర్తించగలుగుతున్నాం.

answer or reject

ఆకుపచ్చ రంగు చూడగానే పాజిటివ్ వైబ్రేషన్, ఎరుపు రంగు చూడగానే నెగటివ్ వైబ్రేషన్ సహజంగానే కలుగుతుంటాయి. అందుకే పలు చోట్ల ఈ రంగులను సందర్భానుసారం వినియోగిస్తూ ఉంటారు. అందుకే మొబైల్ ఫోన్ లలో కూడా.. ఆన్సర్ చేయడానికి పాజిటివ్ సంకేతం గా ఆకుపచ్చ రంగు, రిజెక్ట్ చేయడానికి నెగటివ్ సంకేతం గా ఎరుపు రంగు వినియోగిస్తారు. ఇది ఏ ఫోన్ లో అయినా డిఫాల్ట్ గా సెట్ చేయబడి ఉంటుంది.