Ads
జంతువులలో మనుషులకు తొందరగా మచ్చిక అయ్యేవి కుక్కలు. ఇవి ఫ్రెండ్లీ గా ఉండడమే కాదు విశ్వాసపాత్రులుగా కూడా ఉంటాయి. తమ యజమానులు కనబడకపోతే రెండు రోజులు మూడీగా అయిపోయి తినడం కూడా మానేస్తాయి.
Video Advertisement
కుక్కలు ఎంత ప్రేమ, విశ్వాసాన్ని చూపించినా.. వాటికి ఉన్న సహజ అలవాట్లను మాత్రం మార్చుకోవు. ఎంత నిటారుగా ఉంచినా కుక్క తోక వంకర ఎలా పోదో.. అలానే కుక్కల అలవాట్లు కూడా అంతే.
వాటిల్లో అవి మూత్రం పొసే విధానం ఒకటి అయితే.. మరొకటి పడుకునే విధానం. ఇప్పుడు అంటే పెంపుడు కుక్కల కోసం ప్రత్యేకంగా బెడ్డింగ్ ఏర్పాటు చేస్తున్నారు. కానీ, కుక్కలు పెంపుడు జంతువులుగా మారక ముందు అవి అడవి జంతువులుగానే ఉన్నాయి. ఎక్కువగా కుక్కలు అడవిలోనే నివసించేవి. అడవిలోనే నేలపై మట్టిలో కొంత గొయ్యి తవ్వుకుని పడుకునేవి.
ఇదే అలవాటు వాటికీ కాలక్రమంలో కొనసాగుతూ వచ్చింది. కుక్కలు పడుకునే ముందు తాము పడుకునే ప్లేస్ శుభ్రంగా ఉందో లేదో చూసుకుంటాయి. అలాగే క్రిమి కీటకాలు, పురుగులు వంటి వాటినుంచి నిద్రలో ఇబ్బంది కలగకుండా రక్షణ ఉండేవిధంగా చూసుకుంటాయి. అందుకే అవి పడుకునే ముందు గొయ్యి తవ్వి ఎలాంటి పురుగులు లేవని నిర్ధారించుకుంటాయి.
ఇక మరో విషయం ఏమిటంటే.. అడవిలో చల్లదనం ఎక్కువగా ఉంటుంది. అందుకే కుక్కలకు తమ శరీరానికి తగ్గట్లు గొయ్యి తీసుకుని అందులో వెచ్చగా పడుకోవడం అలవాటు అయ్యింది. ఇదే అలవాటు రోడ్డు పక్కల పడుకునే కుక్కలకు కూడా ఉంటుంది. పెంపుడు కుక్కలకి మాత్రం ఇలా చేయడానికి అవకాశమే ఉండదు. కానీ, వాటిని బయటకి తీసుకెళ్లినప్పుడు గమనించి చూడండి. అవి కూడా మట్టిని కెలుకుతూ కనిపిస్తాయి.
End of Article