Ads
జంతువులలో మనుషులకు తొందరగా మచ్చిక అయ్యేవి కుక్కలు. ఇవి ఫ్రెండ్లీ గా ఉండడమే కాదు విశ్వాసపాత్రులుగా కూడా ఉంటాయి. తమ యజమానులు కనబడకపోతే రెండు రోజులు మూడీగా అయిపోయి తినడం కూడా మానేస్తాయి.
Video Advertisement
కుక్కలు ఎంత ప్రేమ, విశ్వాసాన్ని చూపించినా.. వాటికి ఉన్న సహజ అలవాట్లను మాత్రం మార్చుకోవు. ఎంత నిటారుగా ఉంచినా కుక్క తోక వంకర ఎలా పోదో.. అలానే కుక్కల అలవాట్లు కూడా అంతే.
వాటిల్లో అవి మూత్రం పొసే విధానం ఒకటి అయితే.. మరొకటి పడుకునే విధానం. ఇప్పుడు అంటే పెంపుడు కుక్కల కోసం ప్రత్యేకంగా బెడ్డింగ్ ఏర్పాటు చేస్తున్నారు. కానీ, కుక్కలు పెంపుడు జంతువులుగా మారక ముందు అవి అడవి జంతువులుగానే ఉన్నాయి. ఎక్కువగా కుక్కలు అడవిలోనే నివసించేవి. అడవిలోనే నేలపై మట్టిలో కొంత గొయ్యి తవ్వుకుని పడుకునేవి.
కుక్కలు మొదట్లో అడవి జంతువులు గానే ఉండేవి. ఈ క్రమంలోనే అవి ఎక్కువగా గోతులు తవ్వడం, పడుకునే ముందు ఒకటికి పది సార్లు ఆ గోతులను చెక్ చేసుకోవడం వంటివి చేస్తుంటాయి. అవి దొరికిన ఆహారాన్ని గోతుల్లో దాచుకుని తింటుంటాయి. ఆహరం దొరకడం కష్టం అయిన రోజుల్లో ఆ దొరికిన ఆహారాన్నే సర్దుకునేవి. అయితే.. చంద్రుడు వచ్చాక వేటకి వెళ్లడం కోసం ఇతర కుక్కలను పిలవడం కోసం అరుస్తూ ఉంటాయి. జనజీవనంలోకి వచ్చినా.. ఆ స్వభావం వాటికి పోలేదు. అందుకే ఇప్పటికీ రోడ్డుపై తిరిగే కుక్కలు చంద్రుడిని చూస్తే అరుస్తుంటాయి.
End of Article