Ads
మనకు తుమ్ము వచ్చినప్పుడల్లా కనుగుడ్లు మూసుకోవడం సహజం. కళ్ళు మూసుకునే తుమ్ముతూ ఉంటాం. చాలా మంది ఈ విషయం లో అపోహ పడుతూ ఉంటారు. కళ్ళు తెరిచి తుమ్మితే ఫోర్స్ గా బయటకు వచ్చే గాలి వలన కనుగుడ్లు బయటకు వస్తాయని అనుకుంటూ ఉంటారు.
Video Advertisement
కొంతమంది అయితే.. హార్ట్ బీట్ కూడా ఆగిపోతుందంటారు. నిజానికి తుమ్ము వచ్చినప్పుడు ఒక్క సెకండ్ పాటు స్ట్రక్ట్ అయినట్లు అనిపించినా.. ఇవేమి వాస్తవం కాదు. అసలు నిజమెంతో ఇప్పుడు తెలుసుకుందాం. నిజానికి తుమ్మడాన్ని స్నిజింగ్ అని మాత్రమే కాకుండా స్టర్నుటేషన్ అని కూడా పిలుస్తారు. మనం కళ్ళు ఓపెన్ చేసి కూడా తుమ్మగలుగుతాము. కానీ దానికి నార్మల్ గా తుమ్మడం కంటే ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది.
తుమ్ము వచ్చే సంకేతాలు అందినప్పుడు శరీరం లో జరిగే కొన్ని ఇవ్వాలంటరీ రిఫ్లెక్సీస్ వలన కళ్ళు ఆటోమేటిక్ గా మూసుకుంటాయి. తుమ్ము వస్తుంది అని తెలియగానే, బ్రెయిన్ కళ్ళకు మూసుకొమ్మని సంకేతాలను పంపిస్తుంది. అలాగే.. ముక్కు వద్ద ఉన్న డస్ట్ పార్టికల్స్ అన్ని ముక్కుని ఇరిటేట్ చేస్తూ ఉంటాయి. ఆ సమయం లోనే అబ్డోమినల్ మజిల్స్, చెస్ట్ మజిల్స్ అన్ని కలిసి ఎయిర్ ను బయటకు పంప్ చేస్తాయి.
ఈ ఎయిర్ తుమ్ములాగా బయటకు వచ్చి ముక్కు వద్ద ఇరిటేట్ చేస్తున్న డస్ట్ పార్టికల్స్ ను బయటకు తోసేస్తుంది. అప్పుడు గాని మనకు రిలీఫ్ రాదు. సైంటిస్ట్ ల లెక్క ప్రకారం ఈ గాలి గంటకు వంద మైళ్ళ వేగం తో ప్రయాణిస్తుంది. అయితే ఇంత వేగం గా గాలి బయటకు వచ్చినా కళ్ళు తెరవడం వలన ఏ ఇబ్బంది ఉండదు. ఎందుకంటే కంటికి సంబంధించిన నరాలకు.. ఈ ప్రాసెస్ కు సంబంధం లేదు కాబట్టి. కాకపోతే దీనికి ఎక్కువ ఎఫర్ట్ అవసరం అవుతుంది కాబట్టి.. ఆ సమయం లో మన బ్రెయిన్ కళ్ళకు ఆటోమేటిక్ గా మూసుకోవాలని సంకేతాలను పంపించేస్తుంది.
End of Article