మనకి ఏదైనా అనారోగ్య సమస్య ఉంటె శరీరం వెంటనే మనలని అలెర్ట్ చేస్తుంది. దానికి తగ్గ సంకేతాలుగా చిన్న చిన్న లక్షణాలను మనకి చూపిస్తుంది. వాటి ద్వారా మనం తగిన శ్రద్ధ తీసుకుంటే మన శరీరం అనారోగ్యం బారిన పడకుండా ఉంటుంది. రోగం చిన్నగా ఉన్నపుడే తగిన శ్రద్ధ తీసుకోవాలి.

Video Advertisement

అలా చేయడం ద్వారా దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడవచ్చు. ఈ కళ్ళు ఉబ్బడం కూడా శరీరం అలా చూపించే ఓ సంకేతమే. ఇలా ఎందుకు జరుగుతుందో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

eyes 1

చాలా మందికి కళ్ళ కింద నల్లగా వలయాలు ఏర్పడుతూ ఉంటాయి. సరిగ్గా నిద్రపోకపోవడం వలన ఇలా జరుగుతుంది. మరికొంత మందికి అదే ప్రదేశంలో ఉదయాన్నే నిద్ర లేవగానే బాగా ఉబ్బినట్లు వాపు కనిపిస్తుంది. ఇలా జరగడానికి చాలా కారణాలే ఉంటాయి.

eyes 3

అవేంటంటే.. అధికంగా ఒత్తిడికి గురి అవుతూ ఉండడం, రాత్రి సమయాల్లో చాలినంతగా నిద్ర పోకపోవడం, డీ హైడ్రేషన్ సమస్య, చాలినంత నీటిని తాగకపోవడం, మద్యం, పొగ తాగడం, రాత్రి సమయాల్లో జంక్ ఫుడ్ తినడం, ఎక్కువ సేపు టివి చూడడం, కంప్యూటర్ స్క్రీన్ పై ఎక్కువ సేపు పని చేయడం వంటివి కారణాలు. అయితే కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టేయచ్చు.

eyes 2

రోజు తగినంత నీటిని తాగుతూ ఉండాలి. శరీరం డీ హైడ్రేట్ అవకుండా నీటిని తాగుతూ ఉండడం వలన చర్మం కూడా కాంతిని సంతరించుకుంటుంది. రాత్రి పూట త్వరగా పడుకోవాలి. అలాగే.. ఉదయం త్వరగా లేవాలి. దుమ్ము, దూళి వల్ల కూడా కళ్ళు ఉబ్బుతాయి. అందుకే పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. మద్యం, జంక్ ఫుడ్ వంటి వాటిని తగ్గించాలి. ఉదయాన్నే కళ్ళు ఉబ్బినట్లు కనిపిస్తే.. ఐస్ క్యూబ్స్ తో మర్దనా చేయాలి. తద్వారా ఉపశమనం పొందవచ్చు.