Ads
విస్తరించిన ఇంటర్నెట్ సేవలు మనిషి మనుగడకు ఎంతో సహకారం అందిస్తున్నప్పటికీ, మనిషి వినాశనానికి కూడా అంతే కారణం అయ్యే అవకాశం ఉండేది. ఒకప్పటి రోజుల్లో ప్రతి విషయం గోప్యం గా ఉండేది. కానీ, సోషల్ మీడియా వచ్చిన తరువాత సమాచారం చాలా చీప్ అయిపొయింది. ఒక్క క్లిక్ తో వందలాది మంది మనగురించి ఒకేసారి తెలుసుకుంటున్నారు. ఇది ఎన్నో అనర్ధాలకు దారి తీసే అవకాశం ఉన్నా కూడా, మనలో చాలా మంది పట్టించుకోము. ఫేస్ బుక్ వంటి సాఫ్ట్ వేర్ ను కనిపెట్టి.. దానిని ఈ స్థాయి లో అభివృద్ధి చేసిన మార్క్ జుకర్ బర్గ్ కూడా తన ల్యాప్ టాప్ కి అవసరం లేని సమయం లో టేప్ వేసుకుంటారట. ఎందుకో ఈ ఆర్టికల్ లో చూడండి.
Video Advertisement
పైన ఫోటో చూసారా..? ఈ ఫోటో లో మార్క్ జుకెర్ బర్గ్ తన ల్యాప్ టాప్ కు ఉండే కెమెరా కు, మైక్రో ఫోన్ కు టేప్ వేశారు. ఇలా చేయడం వలన కూడా మనం హ్యాకర్ల నుంచి రక్షణ ను పొందవచ్చట. ఇంతకీ ఎలా అంటే.. మనం నెట్టింట్లో బ్రౌసింగ్ చేస్తున్న సమయం లో రకరకాల వెబ్ సైట్ లను ఓపెన్ చేస్తూ ఉంటాము. ఈ వెబ్ సైట్ లు కుకీస్ ద్వారా మన సమాచారాన్ని ఎంతో కొంత మేర సేకరిస్తూ ఉంటాయి. ఈ సమాచారం ద్వారా హ్యాకర్లు మన మైక్రో ఫోన్ ను, వెబ్ కామ్ ను యాక్సెస్ చేయడానికి, మన ల్యాప్ టాప్ లో ని సమాచారాన్ని కూడా యాక్సెస్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు.
మన ల్యాప్ టాప్ లోని సమాచారం చోరీ కాకుండా ఉండేందుకు మనం రకరకాల సాఫ్ట్ వేర్ లను, విపిఎన్ లను వినియోగించవచ్చు. మరి మన వెబ్ కామ్ యాక్సెస్ కాకుండా ఉండాలి అంటే..? సింపుల్ అండి.. దానిని టేప్ తో కవర్ చేసేయండి. ఇలా చేయడం వలన హ్యాకర్లు మనలని కానీ, మనం చేసే పనులని కానీ చూడలేరు. అలాగే మన చుట్టూ ఉండే శబ్దాలు, మాటలని కూడా వారు రికార్డు చేయలేరు. ఇలా చేయడం వలన మనలని మనం రక్షించుకోవచ్చు. ఈరోజుల్లో ఇంటర్నెట్ వినియోగిస్తున్నాం అంటే.. మనం మన సమాచారాన్ని నడి రోడ్డు పై పెట్టినట్లే.. సో, మీ జాగ్రత్తలు మీరు తీసుకోండి మరి.
End of Article