Ads
మనం ఏదైనా పేపర్స్ ని అంటించాలి అంటే వెంటనే గమ్ ని వెతుకుతాం. అలానే.. చిన్న ప్లాస్టిక్ వంటి వస్తువులని అతికించుకోవడానికి ఫెవిక్విక్ ని ఉపయోగిస్తూ ఉంటాం. మీరెప్పుడైనా గమనించారా..? ఫెవిక్విక్ ఎప్పుడు చిన్న చిన్న ట్యూబ్ లాంటి కంటైనర్ లో లభ్యం అవుతూ ఉంటుంది. మనం ఫైవ్ లేదా టెన్ రూపీస్ పెట్టి కొనుక్కుంటాం..
Video Advertisement
ఒకసారి మనం దానిని ఓపెన్ చేసి వాడిన తరువాత అది మళ్ళీ ఎందుకు పనికి రాదు. మనం చాలా జాగ్రత్తగా దాని మూత పెట్టినా కూడా.. దానిని తిరిగి వాడడానికి చాలా తక్కువ ఛాన్స్ ఉంటుంది. ఇంతకీ చెప్పొచ్చే విషయం ఏంటి అంటే.. మనం వాడడానికి మూత ఓపెన్ చేసాకా అతుక్కునిపోయే ఫెవికాల్ దాని కంటైనెర్ కి మాత్రం అస్సలు అతుక్కోదు..
దానికి కారణం ఏంటి అంటే.. ట్యూబ్ లో ఉండే ఫెవికాల్ లో సైనోయాక్రిలేట్ పాలిమర్ అనే ఆర్గానిక్ సాల్వెంట్ ఉంటుంది. ఈ సాల్వెంట్ గాలి తగలగానే ఆవిరైపోతుంది. ఈ సాల్వెంట్ ఉండడం వలన ఫెవిక్విక్ లో ఉండే ఆటమ్స్ కంటైనర్ లోనే ఆటమ్స్ తో ఎలాంటి బాండింగ్ ను ఏర్పర్చలేవు. అందుకే ఫెవిక్విక్ కంటైనర్ కు అతుక్కోదు..
కానీ, బయటకు రాగానే గాలి తగలడం వలన ఈ సాల్వెంట్ ఆవిరైపోయి ఎక్కడ అంటిస్తే అక్కడ అతుక్కుపోతుంది. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే.. మీరు కంటైనర్ కి చిన్న బొక్క పెడితే.. దాని ద్వారా గాలి లోపలికి వెళ్ళినప్పుడు ఫెవిక్విక్ కంటైనర్ కి కూడా అతుక్కుపోతుంది.
End of Article