Ads
మనము ఎప్పుడైనా ఏదైనా మాల్ కి వెళ్ళినప్పుడు ఫుడ్ కోర్ట్ ఎప్పుడు కూడా పై ఫ్లోర్ లో ఉంటుంది. దీని మీద మీకు ఎప్పుడైనా అనుమానం వచ్చిందా..? ఎందుకు ఫుడ్ కోర్ట్ ని పైన ఉంచాలి అని. మరి దాని కోసం మనం ఇప్పుడు చూసేద్దాం. మొట్టమొదటిసారి షాపింగ్ మాల్ భారతదేశంలో 1980ల్లో కట్టారు.
Video Advertisement
అప్పటినుండి కూడా అనేక మాల్స్ వచ్చాయి. మాల్స్ లో మనకి ఎన్నో రకాల వస్తువులు దొరుకుతాయి. ఎలక్ట్రానిక్ సామాన్లు మొదలు కాస్మెటిక్స్, బట్టలు మొదలైనవి మనం కొనుగోలు చెయ్యచ్చు. అయితే ఎప్పుడూ కూడా ఏ మాల్ కి వెళ్ళినా ఫుడ్ కోర్ట్ అనేది పైన ఉంటుంది. దీనికి గల కారణం ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
#1. ఎక్కువ ప్లేస్ కావాలి కనుక:
సాధారణంగా ఆహార పదార్థాలను తినడానికి మరియు వాటిని వండటానికి ఎక్కువ ప్లేస్ కావాలి. అదే పైన అనుకోండి ఎక్కువ ప్లేస్ ఉంటుంది. అలానే ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. దీని కారణంగానే పై ఫ్లోర్ లో ఫుడ్ కోర్ట్ ని పెడతారు.
#2. సులువుగా ఆపరేట్ చెయ్యొచ్చు:
ఫుడ్ కోర్ట్ కి ఎక్కువ స్పేస్ మరియు వెంటిలేషన్ కావాలి. అయితే ఎటువంటి డిస్ కంఫర్ట్ కలగకుండా కస్టమర్స్ కి కలగకుండా ఉండాలన్న.. సులభంగా కూర్చుని తినాలన్న టాప్ ఫ్లోర్ సౌకర్యంగా ఉంటుంది.
#3. మిగిలినవి మళ్ళీ చూడాలని అనుకోరు:
ఒకవేళ కనుక గ్రౌండ్ ఫ్లోర్ లో ఫుడ్ కోర్ట్ ని పెట్టారంటే అక్కడికి వచ్చి తినేసి వెళ్లిపోతుంటారు. తిన్నాక షాపింగ్ చేయాలని అనిపించదు. ఈ కారణంగా షాపింగ్ చేయరు అందుకనే గ్రౌండ్ ఫ్లోర్ లో పెట్టరు.
#4. కొనుగోలు చేయరు:
ఒకవేళ కనుక మాల్ లో ఫుడ్ కోర్ట్ పైన ఉంటే అప్పుడు కింద నుండి పైకి వెళ్తూ ఏమైనా షాపింగ్ చేస్తారు. బిజినెస్ స్ట్రాటజీ ప్రకారం అందుకనే పైన పెడతారు. దీంతో కింద నుంచి పైకి వెళుతూ ఏదైనా కొనాలని రాకపోయినా నచ్చిన వాటిని కొనేస్తూ ఉంటారు.
End of Article