అమ్మాయిలు వేసుకునే షర్ట్స్ కి పాకెట్స్ ఎందుకు ఉండవు..? వెనకున్న 5 కారణాలు ఇవే..!

అమ్మాయిలు వేసుకునే షర్ట్స్ కి పాకెట్స్ ఎందుకు ఉండవు..? వెనకున్న 5 కారణాలు ఇవే..!

by Anudeep

Ads

ఫ్యాషన్ ప్రపంచం రోజు రోజుకు విస్తరిస్తూనే ఉంది. అందులోను అమ్మాయిలు అలంకార ప్రియులు కాబట్టి వారికి ఎక్కువ వెరైటీలే ఉంటాయి. ఒకప్పుడు ప్యాంటు, షర్ట్ అంటే కేవలం అబ్బాయిలే వేసుకునేవారు.. కానీ ఇప్పుడలా కాదు.. అమ్మాయిలకు రకరకాల డిజైన్లలో షర్ట్ లు వచ్చేస్తున్నాయి. అయితే.. అబ్బాయిల షర్ట్స్ కి, అమ్మాయిల షర్ట్స్ కి ఉండే తేడా ను మీరెప్పుడైనా గమనించారా..?

Video Advertisement

girls 1

అమ్మాయిల షర్ట్స్ కి పాకెట్స్ ఉండవు. ఈమధ్య చాలా వరకు అబ్బాయిల షర్ట్స్ కి పాకెట్స్ రావడం లేదు. కానీ ఒకప్పుడు షర్ట్ అంటే.. రెండు వైపులా జేబులు ఉండేవి. వాటిల్లో పెన్స్, పేపర్స్, మొబైల్స్ ఇలా అవసరమైన వస్తువులను అబ్బాయిలు పెట్టుకునే వారు. కానీ.. అమ్మాయిల షర్ట్స్ కి మాత్రం ఎలాంటి పాకెట్స్ రావు. దానికి ఈ ఐదు పాయింట్లు కారణం కావచ్చు. అవేంటో చూడండి.

girls 2

#1. అబ్బాయిలు హ్యాండ్ బాగ్స్ వాడరు. వారు ఏమైనా పెట్టుకోవాలనుకుంటే పాకెట్స్ లోనే పెట్టుకుంటారు. కానీ, అమ్మాయిలు హ్యాండ్ బాగ్స్ లో పెట్టుకోవడానికి ఆసక్తి కనబరుస్తారు. అవసరం లేదు కాబట్టి అమ్మాయిల షర్ట్స్ కి అసలు పాకెట్స్ లేకుండానే డిజైన్ చేస్తున్నారు.

#2. ఈ ప్యాకెట్ల వల్ల అమ్మాయిలకు లేనిపోని ఇబ్బందులు కూడా ఉంటాయి. ఈ పాకెట్స్ లో వారు ఏమి పెట్టుకోలేరు. ఒకవేళ ఏమైనా పెట్టుకున్నా.. ఆమె చుట్టూ ఉండే అబ్బాయిల చూపులు అటే వెళ్లిపోతాయి. అందుకే పాకెట్స్ లో పెట్టుకోవడానికి అమ్మాయిలు ఇంటరెస్ట్ చూపించరు.

girls 3

#3. ఒకవేళ ఏదైనా పాకెట్ లో పెట్టినా.. ఆ పాకెట్ టైట్ గా కనిపించడం.. ఏదో లాగినట్లు అనిపిస్తూ చాలా అన్ ఈజీ గా ఉంటుంది. అందుకే వారి షర్ట్స్ కి పాకెట్స్ డిజైన్ చేయడం లేదు.

#4. మరో వైపు పాకెట్ ఉన్న షర్ట్స్ కంటే.. పాకెట్ లేకుండా వచ్చే షర్ట్ లకే అమ్మాయిలు ఎక్కువ ఓటేస్తున్నారని తేలడం తో.. డిజైనర్లు కూడా అలానే కొడుతున్నారు. పైగా.. వారికి కొంత క్లాత్ కూడా సేవ్ అవుతుంది.

girls 4

#5. అమ్మాయిల షర్ట్ లను డిజైన్ చేసిన తొలి రోజుల్లో.. వారి షర్ట్ లకు పాకెట్ పెడితే అమ్మాయిల షర్ట్ కి, అబ్బాయిల షర్ట్ కి తేడా ఉండదు అని భావించేవారు. అందుకే వారి షర్ట్స్ కి పాకెట్స్ లేకుండానే డిజైన్ చేసారు.


End of Article

You may also like