Ads
మనకు ఏ విషయం తెలియకపోయినా గూగుల్ తల్లిని అడిగేయడం మనకి అలవాటే. ప్రతి చిన్న ప్రశ్నకి సమాధానం గూగుల్ లో దొరుకుతుంది. ప్రపంచంలోనే అతి పెద్ద టెక్నాలజీ సంస్థగా గూగుల్ అవతరించింది. ఈ సంస్థకి సీఈఓగా మన భారతీయుడు సుందర్ పిచాయ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడన్న సంగతి తెలిసిందే.
Video Advertisement
టెక్నాలజీ పరంగా ఎంతముందుకు వెళ్లినా.. కొన్ని విషయాల్లో సమయానుకూలంగా నిర్ణయాలు ఎలా తీసుకుంటాం అన్న విషయం పైనే ఓ వ్యక్తి తెలివితేటలు ఆధారపడి ఉంటాయి.
ఇలాంటి తెలివితేటలు మన భారతీయులకి సహజసిద్ధంగానే వచ్చేస్తూ ఉంటాయి. గూగుల్ సంస్థలో జరిగిన అలాంటి ఒక సంఘటనే దీనికి ఉదాహరణ. గూగుల్ సంస్థ కాలిఫోర్నియా గ్రేజింగ్ అనే కంపెనీ దగ్గరనుంచి రెండొందల మేకలను రెంట్ కి తీసుకుంది. అసలు గూగుల్ సంస్థకి మేకలతో పనేంటి..? అన్న సందేహం మీకు కలిగి ఉండొచ్చు. ఇంతకీ ఆ పనేంటో చూద్దాం.
గూగుల్ సంస్థ చుట్టూ గడ్డి బాగా మొలిచింది. దీనితో పరిసరాలను శుభ్రం చేయించాల్సిన అవసరం ఏర్పడింది. సాధారణంగా ఎవరైనా గడ్డిని తొలగించే వర్కర్లను ఎంచుకుంటారు. వారికి కాంట్రాక్టు మాట్లాడుకుని పని చేయించుకుంటారు. కానీ ఇక్కడే గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఓ తమాషా చేసారు. మేకలను ఓ వారం రోజుల పాటు రెంట్ కి తీసుకున్నారు. ఆ మేకలన్నీ.. గూగుల్ సంస్థ పరిసరాల్లో ఉన్న గడ్డిని ఎంచక్కా తినేసాయి.
సాధారణంగా కూలీలను పెట్టి పని చేయించుకునే సమయం కంటే తొందరగానే ఈ ప్రక్రియ పూర్తయ్యింది. ఒకవేళ కూలీలను పెట్టి పని చేయించుకుని ఉండి ఉంటె ఆ గడ్డిని పడేయాల్సి ఉంటుంది. అదే మేకలను పెట్టుకోవడం వల్ల రెండు లాభాలు ఉన్నాయి. మొదటిది పరిసరాలలో గడ్డి మొక్కలు లేకుండా క్లీన్ అయిపోవడమే కాకుండా.. మేకల మలమూత్రాదులతో ఆ నేల ఫెర్టిలైజ్ కూడా అయిపొయింది. ఐడియా చిన్నదే.. కానీ ఫలితం గొప్పది అని ఇలాంటి సంఘటనలను చూసే అంటుంటారు కదా..
End of Article