Ads
హిందూ ధర్మం ప్రకారం గంగానది స్నానానికి చాలా ప్రాధాన్యత ఉంది. గంగా నది తీరాన హిందూ సంప్రదాయ ప్రకారం ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. వాటిలో ముఖ్యంగా గంగానది తీరంలో జరిపించే దహన సంస్కారాలకు చాలా ప్రాముఖ్యత ఉంది.
Video Advertisement
హిందూ సంప్రదాయం ప్రకారం దహన సంస్కారాల తరువాత అస్థికలను గంగా నదిలో నిమజ్జనం చేస్తారు. ఇది ఇప్పటిది కాదు తరతరాలుగా ఈ సంప్రదాయాన్ని పాటిస్తూ వస్తున్నారు. అయితే హిందువులు మరణించిన వారి అస్థికలను ఎందుకు గంగానదిలో నిమజ్జనం చేస్తారనే విషయన్ని ఇప్పుడు చూద్దాం.. భారతదేశంలో ఉన్న జీవనదుల్లో ప్రధానమైన నది గంగా నది. హిందువులు గంగానదిని చాలా పవిత్రంగా పూజిస్తారు. హిందువుల మతపరమైన విశ్వాసాలకు మరియు స్వచ్ఛతకు గంగానది ముఖ్యమైన సూచిక. వేద కాలం నుండి పవిత్రమైన, మతపరమైన కార్యక్రమాలకు గంగా జలాన్ని ఉపయోగిస్తున్నారు. గంగా జలాన్ని సేవిస్తే పాపాలు చేసిన వారికి సైతం మోక్షం కలుగుతుంది. ఆఖరి ఘడియలు సమీపించినవారికి గంగాజలాన్ని తులసితో కలిపి తాగిస్తే స్వర్గ ప్రాప్తి కలుగుతుందని పూర్వీకుల నుండి గంగాజలాన్ని సేవిస్తారు.
అగ్ని పురాణంలో 110 అధ్యాయంలో గంగా నది మహత్యాన్ని అగ్నిదేవుడే స్వయంగా వివరించాడని చెబుతారు. అగ్ని పురాణంలో చెప్పిన ప్రకారం, ఎల్లప్పుడు గంగను సేవిస్తూ ఉండాలట. గంగానది భుక్తి ముక్తి ప్రదాయని. భుక్తి ఇస్తుంది, ముక్తిని కూడా ఇస్తుంది. అంటే ఈ జన్మలో ఎంతో పుణ్యఫలాన్నీ అందిస్తుంది. మరణానంతరం కూడా ముక్తిని ప్రసాదిస్తుంది. ఏయే ప్రాంతాల నుండి గంగ ప్రవహిస్తుందో ఆ ప్రదేశాలన్నీ పావనాలే అని అగ్నిదేవుడు చెప్పాడు.దివ్యాంగులు గంగానది స్నానం చేస్తే వారు దేవతలతో సమానంగా భాసిల్లుతారట. గంగానది సేవించిన వారి మాతృ వంశం మరియు పితృ వంశం కూడా తరింపబడతాయి. ఒక వ్యక్తి మరణించిన తరువాత ఆ వ్యక్తి దహన సంస్కారాలు పూర్తి చేసిన తరువాత అస్థికలను గంగానదిలో నిమజ్జనం చేస్తారు. ఒక వ్యక్తి అస్థికలు గంగానదిలో ఉన్నంతవరకు ఆ జీవి స్వర్గం లోనే నివసిస్తారని అగ్ని పురాణంలో చెప్పబడింది. అందుకోసమే గంగానదిలో అస్థికలు కలుపుతారు.
Also Read: “కలియుగం” ముగింపు ఎలా సంభవిస్తుందో తెలుసా..! గరుడ పురాణంలో ఏం చెప్పారంటే..?
End of Article