ఐస్ క్యూబ్స్ నీటిలో తేలుతాయి.. కానీ మద్యంలో మునిగిపోతాయి ఎందుకో తెలుసా..? అసలు కారణం ఇదే..!

ఐస్ క్యూబ్స్ నీటిలో తేలుతాయి.. కానీ మద్యంలో మునిగిపోతాయి ఎందుకో తెలుసా..? అసలు కారణం ఇదే..!

by Anudeep

Ads

మనం మిల్క్ షేక్, జ్యూస్ వగైరా వాటిని తయారు చేసుకునేటప్పుడు ఐస్ క్యూబ్స్ ని వాడతాము. ఇక మందు తాగేవారు కూడా తమ డ్రింక్ లో ఐస్ క్యూబ్స్ వేసుకుని తాగుతూ ఉంటారు. అయితే మీరెప్పుడైనా గమనించారా..? ఐస్ క్యూబ్స్ ని డ్రింక్ ఉన్న గ్లాస్ లో వేస్తె అవి మునిగిపోతాయి.

Video Advertisement

అదే మాములు నీరు ఉన్న గ్లాస్ లో వేసి చూడండి. ఐస్ క్యూబ్స్ పైకి తేలుతూ ఉంటాయి. ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా..? ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి. దీని వెనుక సైంటిఫిక్ రీజన్ ఉంది.

ice 1

ఇలా ఆల్కహాల్ లో వేసినప్పుడు ఐస్ క్యూబ్స్ మునిగిపోవడానికి, నీటిలో తేలడానికి అసలు కారణం సాంద్రత. నీటి యొక్క సాంద్రత ఎక్కువగా ఉంది. నీరు, వైన్, ఇంకా మంచు విషయంలో కూడా ఇదే కారణం. ఆల్కహాల్ లో క్యూబిక్ సెంటీమీటర్ కు సాంద్రత 0.789 గా ఉంటుంది. అదే నీటికి ఒక క్యూబిక్ సెంటీమీటర్ కు సాంద్రత 1.0 గా ఉంటుంది. ఇక మంచు కి ఈ వేల్యూ 0.917 గా ఉంటుంది. ఆల్కహాల్ తో పోలిస్తే నీటికి, మంచుకు సాంద్రత ఎక్కువగా ఉంటుంది. మంచు కంటే నీటి సాంద్రత ఎక్కువగా ఉంటుంది.

ice 2

ఆల్కహాల్ సాంద్రత కంటే మంచు సాంద్రత ఎక్కువ కాబట్టి గ్లాస్ లో వేయగానే మునిగిపోతుంది. కానీ నీటి సాంద్రత ఐస్ సాంద్రత కంటే ఎక్కువ కాబట్టి మంచు మునగదు. పైకి తేలుతుంది. నిజానికి ఘన పదార్ధమైన మంచులో సాంద్రత ఎక్కువగా ఉండాలి. కానీ నీటి కంటే మంచు సాంద్రత తక్కువే ఉంటుంది. ఇలా ఎందుకు ఉంటుందో ఇపుడు తెల్సుకుందాం. ఒక ద్రవాన్ని చల్లబరిచినప్పుడు, ఎక్కువ అణువులు ఒకదానికొకటి దగ్గరగా ఉంటాయి మరియు చిన్న ప్రదేశంలో ఉంచాలి. దీని ఫలితంగా చాలా ఘనపదార్థాలు ద్రవపదార్థాల కంటే ఎక్కువ సాంద్రత కలిగి ఉంటాయి.

ice 3

మంచుతో అలా కాదు. నీరు సానుకూలంగా ఛార్జ్ చేయబడిన హైడ్రోజన్ అణువులను మరియు ప్రతికూలంగా ఛార్జ్ చేయబడిన ఆక్సిజన్ అణువులను కలిగి ఉంటుంది. నీరు చల్లబడినప్పుడు, హైడ్రోజన్ బంధాలు ప్రతికూలంగా ఛార్జ్ చేయబడిన ఆక్సిజన్ అణువులను వేరుగా ఉంచడానికి సర్దుబాటు చేస్తాయి, ఇది మంచు దట్టంగా మారకుండా నిరోధిస్తుంది. కాబట్టి నీటి కోసం, ఉష్ణోగ్రత తగ్గడంతో పాటు సాంద్రత వాస్తవానికి తగ్గుతుంది


End of Article

You may also like