ప్రపంచం లోనే అతి పెద్ద రైల్వే సంస్థ గా భారతీయ రైల్వే కు గుర్తింపు ఉన్న సంగతి తెలిసిందే. లక్షల మంది రైల్వే లో పని చేస్తూ ఉంటారు. రైల్వే లో జాబ్ కొట్టడం కూడా చాలా మందికి ఒక డ్రీం. అయితే.. రైల్వే గురించి చాలా విషయాలు మనకు తెలియవు. అందులో ఇది కూడా ఒకటి. భారత రైల్వే లో ఎక్కువ రైళ్లు ఎందుకు కేవలం నీలి రంగులోనే ఉంటాయి..?

indian railway

గతం లో 1990 కి ముందే రైల్వే లో అడ్వాన్స్డ్ బ్రేకింగ్ సిస్టం ఉండేది. ఇది రాక ముందు వాక్యూమ్ బ్రేకింగ్ వ్యవస్థ ఉండేదట. అయితే అడ్వాన్స్డ్ బ్రేకింగ్ సిస్టం వచ్చిన తరువాత ఈ రెండు వ్యవస్థల మధ్య గందర గోళం ఏర్పడిందట. అంటే.. ఏ రైలు ఏ వ్యవస్థ తో పని చేస్తోందో చెప్పడం కష్టతరం గా మారింది. దీనితో.. భారత రైల్వే కు ఓ ఐడియా వచ్చింది.

indian railway 2

వాక్యూమ్ బ్రేకింగ్ సిస్టం ఉన్న రైళ్లకు ఎర్ర రంగుని వేసి.. అడ్వాన్స్డ్ బ్రేకింగ్ సిస్టం ఉన్న రైళ్లకు నీలి రంగు వేస్తూ వచ్చారట. అయితే.. ప్రస్తుతానికి వచ్చేసరికి వాక్యూమ్ బ్రేకింగ్ సిస్టం ఉన్న రైళ్లు అంత గా లేవు. ఎక్కువ గా అన్ని రైళ్లు అడ్వాన్స్డ్ బ్రేకింగ్ సిస్టం తోనే నడుస్తున్నాయి. అందుకే ఇవన్నీ నీలి రంగులో ఉంటాయి. ఇక..రాజధాని, శతాబ్ది వంటి రైళ్లు ప్రత్యేక రంగులతో ఉంటున్నాయి.