Ads
మనకు ఏదైనా అనారోగ్యం చేసినా.. ఏదైనా ఇబ్బంది ఎదురైనా వైద్యులు మెడిసిన్ ను ఇస్తుంటారు కదా. ఇది రెండు రకాలు గా ఇస్తుంటారు. టాబ్లెట్స్ ను ఇవ్వడమో లేదా ఇంజక్షన్ ను ఇవ్వడమో చేస్తారు. అయితే.. ఇంజెక్షన్ ను ఎక్కువగా భుజాలకు లేదా పిర్రలకు ఇస్తూ ఉంటారు. దీనికి గల కారణం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
సాధారణం గా ఇంజక్షన్ చేసేటపుడు ముంజేయి పై ఉండే వీన్స్కు ఇంజెక్షన్ ఇస్తుంటారు. దీనిని ఇంట్రా వీనస్ ఇంజక్షన్ అంటారు. అలాగే.. భుజం వద్ద, పిర్రల వద్ద ఉండే మజిల్స్ కి కూడా ఇస్తుంటారు. ఈ ఇంజెక్షన్లను ఇంట్రా మస్క్యులర్ ఇంజెక్షన్స్ అంటారు. శరీరానికి అవసరమైన మెడిసిన్ ను స్లో గా శరీరానికి అందించేలా ఇవ్వడం కోసమే ఈ ఇంజెక్షన్లను చేస్తారు.
ఇంజెక్షన్ల వలన బాడీ కి త్వరగా ఎనర్జీ వస్తుంది. షోల్డర్ కింద ఉన్న కండరాలకు, వెనక ఉన్న మజిల్స్ కి ఇవ్వడం వలన మెడిసిన్ శరీరం లోకి మెల్లగా డిఫ్యూజ్ అవుతూ సర్క్యూలేటరీ సిస్టం పై ప్రభావం చూపిస్తుంది. తద్వారా మన శరీరానికి కలిగిన అనారోగ్యాన్ని తగ్గిస్తుంది. శరీరం లోని భుజము, పిర్రల వద్ద ఉండే వీన్స్, మజిల్స్ ఎక్కువ మెడిసిన్ ను తీసుకోవడం లో ఎక్కువ ప్రభావ వంతం గా పని చేస్తాయి కాబట్టి.. ఆ శరీర భాగాలకే ఇంజక్షన్ ను చేస్తారు.
End of Article