Ads
మీరెప్పుడైనా గమనించారా..? ఐరన్ బాక్స్ కి ఉండే వైరు చుట్టూతా క్లాత్ తో కప్పినట్టు డిజైన్ చేసి ఉంటుంది. మరే ఇతర వైర్లు ఇలా ఉండవు. టివి కి ఉండే వైర్లను, ఫ్రిడ్జ్ కి ఉండే వైర్లను గమనించండి. సాధారణం గా ఉండే ప్లాస్టిక్ కవరింగ్ తప్ప, క్లాత్ కవరింగ్ ఉండదు. ఇలా ఎందుకు ఉంటుందో మీరు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోవచ్చు.
Video Advertisement
ఎలక్ట్రిక్ ఐరన్ బాక్స్ తో మనం బట్టలు ఇస్త్రీ చేసుకుంటాం. ఇందుకోసం ఎక్కువ శాతం లో ఉష్ణోగ్రతలు అవసరం అవుతుంటాయి. ఈ పరికరాల్లో ఉపయోగించే వస్తువులు కూడా ఎక్కువ ఉష్ణోగ్రతను ఉత్పన్నం చేసేవే అయి ఉంటాయి. సాధారణం గా ఉపయోగించే ప్లాస్టిక్ కవరింగ్ లు ఈ వేడిని తట్టుకోలేక కరిగిపోతాయి. అందుకే ఫాబ్రిక్ ఇన్సులేట్స్ (క్లాత్ కవరింగ్) లను వినియోగిస్తారు.
ప్లాస్టిక్ మెటీరియల్ కానీ, రబ్బర్ మెటీరియల్ కానీ క్లాత్ కంటే ఎఫెక్టివ్ గా పని చేయగలిగే సామర్ధ్యాన్ని కలిగి ఉంటాయి. కానీ ఐరన్ బాక్స్ విషయం లోకి వచ్చేసరికి.. ఎక్కువ వేడిని తట్టుకోవడం లో ఇవి విఫలమవుతాయి. అందుకోసమే వైర్ చుట్టూ ఎక్కువ టెంపరేచర్ ను తట్టుకోగలిగే పవర్ ఉన్న మెటీరియల్ ను ఉపయోగించాల్సి ఉంటుంది. ఆ మెటీరియల్ కి తక్కువ ఉష్ణ వాహకత (థర్మల్ కండక్టివిటీ) ఉండాలి. అప్పుడే అది మనలని కరెంటు షాక్ ల నుంచి రక్షించగలుగుతుంది. ఫ్లెక్సిబిలిటీ ని కలిగి ఉండాలి.
మందం గా అల్లిక కలిగిన క్లాత్ ఈ లక్షణాలు కలిగి ఉంటుంది. అందుకే ఇలాంటి క్లాత్ నే ఐరన్ బాక్స్ కి గల వైర్ చుట్టూ అల్లుతారు. సేఫ్టీ కోసమే ఈ క్లాత్ ను వినియోగిస్తారు. ఎక్కువ ఉష్ణోగ్రతలు వచ్చిన సమయం లో ఇది రబ్బర్, ప్లాస్టిక్ లాగ కరిగిపోకుండా కరెంట్ నుంచి మనకు రక్షణ ఇవ్వగలుగుతుంది.
End of Article