Ads
శ్రావణ మాసం లో వచ్చే పౌర్ణమి కి ఎంతో విశిష్టత ఉంది. ఆరోజునే నూలి పౌర్ణిమ అని, జంధ్యాల పౌర్ణమి అని కూడా అంటుంటారు. ఉపనయనం చేసుకున్న వారు ఈరోజున కచ్చితం గా వారి జంధ్యాన్ని మార్చుకుంటారు. దీనినే ఉపాకర్మ అని పిలుస్తారు. అలాగే.. ఈరోజున సోదరీమణులు తమ సోదరులకు రాఖీలను కడుతూ ఉంటారు.
Video Advertisement
సోదర, సోదరిల బంధాన్ని మరింత పటిష్టం చేసుకోవాలని గుర్తు చేసే పండగ రాఖి పండగ. ఈరోజున సోదరుల సుఖ సంతోషాలను కోరుకుంటూ చెల్లెల్లు, అక్కలు తమ సోదరులకు రాఖీలను కడతారు. ఆ తరువాత మిఠాయి తినిపించి ఆశీర్వాదం తీసుకుంటారు. సోదరులు తమ సోదరికి ఏదైనా చిరు కానుకలు ఇవ్వడం ఎప్పటినుంచో ఆనవాయితీ గా వస్తోంది. అయితే శ్రావణ పౌర్ణమి రోజునే ఎందుకు రాఖి కడతారో తెలుసుకుందాం.
ఈరోజున సోదరీమణులు రాఖి కట్టే సమయం లో “యేన బద్ధో బలీరాజా దానవేంద్రో మహాబలః తేన త్వామభి బధ్నామి రక్షమాచల మాచల” అనే మంత్రాన్ని చదువుతారు. అంటే.. బలి చక్రవర్తి తన సోదరిని ఎల్లవేళలా కంటికి రెప్పలా కాపాడారు. అలాగే.. నీవు కూడా నన్ను పట్టుకుని విడవకుండా ఉండు అని చెబుతూ రాఖీ కడతారు.
అసలు రక్షా బంధనం కట్టడం వెనుక ఉద్దేశ్యమేమిటంటే.. జీవితాంతం విడువకుండా రక్ష కలిగించు అని కోరుకోవడం. ఇది అన్న చెల్లెళ్ళ పండుగ గానే ప్రాశస్త్యం పొందినా.. రాజుల కాలం లో ఈ రక్ష కట్టడం అనేది ఆనవాయితీ గా ఉండేదట. రాజు యుద్ధానికి వెళ్తున్నప్పుడు.. అతను విజయం సాధించి రావాలని.. భార్య నుదిటి తిలకం దిద్ది రక్ష కట్టి పంపేదట.
End of Article