Ads
ఒకే మాట, ఒకే భార్య మాట తప్పని వ్యక్తిత్వం, మడమ తిప్పని శౌర్యం వీటన్నింటికి ప్రతి రూపమే శ్రీరాముడు.అందరికీ ఆదర్శప్రాయుడు. ఈ లక్షణాలు ప్రతి ఒక్కరిలోనూ ఉండాల్సిన లక్షణాలు. వాల్మీకి రాసిన రామాయణం ద్వారా శ్రీరాముడి కథ అందరికి తెలిసిందే.
Video Advertisement
రామరాజ్యం గురించి చాలా గొప్పగా చెప్పడం వింటూ ఉంటాము. అయితే రాముడి కన్నా ముందు చాలా మంది అయోధ్యను పాలించినా, అయోధ్యని రామరాజ్యం అని ఎందుకు అంటారో తెలుసా? ఇదే ప్రశ్నని కోరాలో ఒకరు అడిగితే సాయిగోపాల్ చిలకపాటి అనే వ్యక్తి ఈ విధంగా చెప్పారు.
శ్రీ మహా విష్ణువు ఏడవ అవతారము రామావతారము. దేవుడు అయినప్పటికి రాముడు జన్మించినప్పటి నుండి అవతారం చాలించే వరకు మానవుడుగానే జీవించారు. తన వ్యక్తిత్వంతో, సకల గుణాలతో అందరికి ఆదర్శంగా నిలిచి దేవుడిగా మారాడు. అందుకే సకల గుణాభిరాముడిగా పిలుస్తారు. తండ్రి మాట కోసం 14 ఏళ్ల పాటు అరణ్యవాసం చేసాడు. సీతను ఎత్తుకెళ్లిన రావణుడితో యుద్ధం చేసి, భార్యను తిరిగి పొందాడు. అయోధ్యకు తిరిగివచ్చిన తరువాత రాజుగా పట్టాభిషేక్తుడు అయ్యాడు. ఆయన పాలించిన సమయాన్ని రామరాజ్యం అని పిలుస్తారు.
రామాయణం ఉత్తర కాండలో రామరాజ్యం గురించి స్పష్టమైన వివరాలు లేనప్పటికీ, రామాయణం ప్రారంభం నుండి రాముడి వ్యక్తిత్వం, ప్రవర్తన గురించి మహర్షి వాల్మీకి చెప్పిన విషయాలను అనుసరించి రామరాజ్యం గురించి అర్ధం చేసుకోవచ్చు. శ్రీ రాముడు పట్టాభిషిక్తుడైన అనంతరం 11 వేల సంవత్సరాల పాటు అయోధ్యని పాలించాడు. శ్రీ రాముడి పాలన చాలా ఆదర్శవంతమైనది. వేద శాస్త్రాల ప్రకారం ధర్మాన్ని తూచా తప్పకుండా పాటించే వాడు. ఎవ్వరినీ కష్ట పెట్టలేదు. రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండేవారు. ఎవరి ధర్మాలు వారు పాటించేవారు.
రాజ్యం బాగుండడం అంటే అక్కడి ప్రజలందరు ధనవంతులు అని కాదు. శ్రీ రాముని పాలనలో దొంగతనం, కరవు లేదని అంటారు. రాముని పాలనలో ప్రతి ఒక్కరు సుఖ, సంతోషాలతో సంతృప్తిగా జీవించేవారట. వర్షాలు సరైన సమయంలో పడేవట. నెలలో మూడు సార్లు వర్షం కురవడంతో పంటలు బాగా పండేవి. రాజ్యం సశ్యామలంగా ఉండేదట. రాముని రాజ్యంలో అందరికి సమంగా న్యాయం జరిగేది. అందువల్లనే రామరాజ్యం అని చెబుతారు.
Also Read: సాయంత్రం 6 తర్వాత ఈ వస్తువులను ఇంట్లోకి తెస్తే శని వచ్చినట్లే..!!
End of Article