జపాన్ వారు అన్నం తినేటప్పుడు ఎందుకు మోకాళ్లపై కూర్చుంటారు? దీని వెనుక కారణం ఏంటంటే?

జపాన్ వారు అన్నం తినేటప్పుడు ఎందుకు మోకాళ్లపై కూర్చుంటారు? దీని వెనుక కారణం ఏంటంటే?

by Anudeep

Ads

జపాన్‌లో, చాలా సందర్భాలలో నేలపై నిటారుగా కూర్చుని భోజనం చేయడం సర్వ సాధారణంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ప్రస్తుతం అక్కడ కూడా మోడరన్ కల్చర్ అభివృద్ధి చెందింది. ప్రస్తుతం అక్కడ కూడా టేబుల్ కల్చర్ కనిపిస్తున్న.. సాంప్రదాయక భోజనాలలో మాత్రం వారు మోకాళ్లపై కూర్చుని తినడం కనిపిస్తూ ఉంటారు.

Video Advertisement

ఈ పద్దతిలో వారు భోజనం చేసే టేబుల్స్ చాలా చిన్నవిగా ఉంటాయి. మరియు వారు కూర్చునే స్థలంపై టాటామీ మాట్స్ ను పరుస్తారు. దానిపై మోకాళ్లపై కూర్చుని భోజనం చేస్తారు.

japan people 2

కానీ.. ఇలా కూర్చుని భోజనం చేయడం చాలా కష్టం. తక్కువ సమయంలోనే కాళ్ళు పట్టేస్తూ ఉంటాయి. భోజనం చేసేటప్పుడు మరియు టీ తాగే సమయాల్లోనూ ఇలా ఇతర సాంప్రదాయ కార్యక్రమాలలో మోకరిల్లి కూర్చోవడం అనేది అక్కడ ఎప్పటినుంచో ఆచారంగా వస్తోంది.

japan people 1
చాలా మంది జపనీస్ ప్రజలు తినేటప్పుడు మోకరిల్లడానికి ఇష్టపడతారు ఎందుకంటే అది వారికి ఎత్తుగా కూర్చునేందుకు అనువుగా ఉంటుంది. ఇలా మోకరిల్లి కూర్చున్నపుడు వంగి ఉండలేరు కాబట్టి అలా కూర్చున్న వ్యక్తుల భుజాలు మరియు వీపు బలంగా ఉంటాయి మరియు మీ వెన్నెముక నిటారుగా ఉంటుంది. ఆరోగ్య రీత్యా కూడా ఇది మేలు చేస్తుందని వారు భావిస్తారు. అందుకే వారు సాంప్రదాయక భోజనాలలో ఇలా కూర్చుంటూ ఉంటారు.


End of Article

You may also like