రాముడి చే 14 సంవత్సరాలే వనవాసం చేయించాలని కైకేయి ఎందుకు కోరింది?

రాముడి చే 14 సంవత్సరాలే వనవాసం చేయించాలని కైకేయి ఎందుకు కోరింది?

by Anudeep

Ads

శ్రీ రామునికి పట్టాభిషేకం జరగాల్సి ఉండగా… ఆ సమయం లో దశరధుని భార్య కైకేయి కోరకూడని వరం కోరింది. అందుకే శ్రీ రాముడు పదునాలుగేళ్ళు వనవాసం చేయాల్సి వచ్చింది. అయితే.. కైకేయి అలా కోరడం వెనక కారణం మంధర. ఆమె కైకేయి దాసి. వివాహానికి ముందు కూడా కైకేయికి ఆమె దాసిగా ఉండేది. పెళ్లి అయిన తరువాత కైకయితో పాటే ఆమె కూడా వచ్చేస్తుంది. అప్పటినుంచి ఆమెతో సాన్నిహిత్యం పెంచుకుని ఆమె మాటలు చెల్లేటట్లు చేసుకుంటూ ఉంటుంది.

Video Advertisement

ఆమె శ్రీరాముని చే పదునాలుగు సంవత్సరాలు వనవాసం చేయించాలని కైకేయి కి చెప్పడం వల్లే కైకేయి దశరథుడిని ఆ వరం ఇవ్వాలని కోరుతుంది. అయితే.. మంధర పదునాలుగు సంవత్సరాలే ఎందుకు చెప్పింది..? ఆమె కావాలనుకుంటే అంతకంటే ఎక్కువ అయినా చెప్పొచ్చు.. లేదా తక్కువ అయినా చెప్పొచ్చు. కానీ ఆ సంఖ్యే చెప్పడానికి ఓ కారణం ఉంది.

త్రేతాయుగం లో ఆస్తి హక్కుకు కాల పరిమితి పదునాలుగు సంవత్సరాలు. ఈ కాల పరిమితి ద్వాపర యుగం లో పన్నెండు సంవత్సరాలు గాను.. కలియుగం లో పది సంవత్సరాలు గాను ఉందని చెబుతారు. ఈ లెక్క లో శ్రీ రాముడు 14 ఏళ్ళు వనవాసం చేస్తే.. ఆయనకు ఆస్తి పై హక్కు ఉండదు. అందుకే మంధర ఇలా అడిగిస్తుంది.


End of Article

You may also like