Ads
తిరుమల క్షేత్రం ఎంత ప్రసిద్ధమైనదో అందరికి తెలిసినదే. కలియుగ వైకుంఠంగా పిలవబడుతున్న తిరుమలలో ప్రసాదాలు కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. తిరుమల కొండపై ఉన్న ప్రతి స్థలానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఒక్కో స్థలానికి పెట్టిన పేరు వెనుక ఒక్కో కథ ఉంటుంది.
Video Advertisement
చెప్పే వాళ్ళు ఉండాలే కానీ.. తిరుమల గురించి ఎంత తెలుసుకున్నా.. ఇంకా తెలుసుకోవాల్సింది చాలానే ఉంటుంది. వాటిల్లో మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే అక్కడ ఉన్న కల్యాణ కట్ట.
తిరుమలలో తలనీలాలను సమర్పించే చోటుని కల్యాణ కట్ట అని పిలుస్తారు. నిజానికి జుట్టు కత్తిరించుకోవడాన్ని క్షవరం అని అంటారు. వాస్తవానికి ఈ ప్రదేశం పేరు కూడా క్షవర శాల అని కానీ లేక క్షవరం అని అర్ధం వచ్చేలా మరేదైనా ఉండాలి. కానీ, ఈ ప్రదేశాన్ని మాత్రం కల్యాణ కట్ట అని పిలుస్తారు. అయితే.. ఇలా పిలవడానికి కూడా ఓ కారణం ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
సర్పయాగం నిర్వహించిన మహారాజు జనమేజయుడు అన్న సంగతి అందరికి తెలుసు. ఆయన సోదరుడే శతానీకుడు. క్షవరం అనే పదానికి బదులుగా కళ్యాణం అనే శుభ సూచకంగా ఉన్న పదాన్నే వాడాలని ఆయనే సూచించారు. ఆయన అలా సూచించడం వల్లనే క్షవరం అనే పదానికి బదులు కళ్యాణం అనే పదం ప్రాచుర్యంలోకి వచ్చింది. కాల క్రమంలో దానిని కల్యాణ కట్ట అని పిలవడం ప్రారంభించారు. వేం అనగా పాపాలను, కట అనగా తొలగించే అని అర్ధం. పాపాలను తొలగించే కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి కాబట్టే.. ఆయనకు తలనీలాలు సమర్పించడం అంత ప్రాధాన్యతను సంతరించుకుంది.
End of Article