అమ్మాయిల జీన్స్ పాకెట్స్ అబ్బాయిల పాకెట్స్ కంటే ఎందుకు చిన్నగా ఉంటాయి..? దీని వెనుక ఇంత కారణం ఉందా..?

అమ్మాయిల జీన్స్ పాకెట్స్ అబ్బాయిల పాకెట్స్ కంటే ఎందుకు చిన్నగా ఉంటాయి..? దీని వెనుక ఇంత కారణం ఉందా..?

by Anudeep

ఈరోజుల్లో ఆడ, మగా తేడా లేకుండా అందరు జీన్స్ ధరిస్తున్నారు. ఎక్కువ కాలం వీటిని సౌకర్యవంతం గా ధరించవచ్చు. అందుకే అబ్బాయిలైనా.. అమ్మాయిలైనా జీన్స్ ధరించడానికి ఎక్కువ గా ఆసక్తిని కనబరుస్తున్నారు. యువత మాత్రమే కాదు.. కొందరు పెద్దలు కూడా వీటిని ధరించడానికి మక్కువ చూపిస్తున్నారు.

Video Advertisement

జీన్స్ పట్ల ఈ మోజు దాదాపు కొన్ని తరాల నుంచి వస్తూనే ఉంది.. ఎన్నో రకాల మోడల్స్ వస్తుండడం తో.. జీన్స్ ఎప్పుడు ఫ్యాషన్ ప్రపంచం లో ట్రేండింగ్ లో నిలుస్తూనే ఉంది.

jeans pocket 1

స్కిన్నీ జీన్స్, బేసిక్ జీన్స్, సిగరెట్ జీన్స్.. ఇలా రకరకాల మోడల్స్ అందుబాటులోకి వచ్చాయి. అయితే.. మోడల్స్ ఎన్ని రకాలుగా ఉన్నా అన్ని రకాల జీన్స్ కి కామన్ గా ఉండే పాయింట్ ఏమిటంటే.. వాటికి ఫ్రంట్ సైడ్ లో పాకెట్స్ ఉండడం. అది అమ్మాయిల జీన్స్ అయినా.. అబ్బాయిల జీన్స్ అయినా ఈ పాకెట్స్ ఉండడం మాత్రం కామన్.

jeans pocket 2

అయితే తేడా ఎక్కడ వస్తుంది అంటే.. అమ్మాయిల పాకెట్స్ అబ్బాయిల జీన్స్ పాకెట్స్ కంటే చిన్నవిగా ఉంటాయి. ఇలా ఎందుకు ఉంటాయి అన్న డౌట్ మీకు ఎప్పుడైనా వచ్చిందా..? అయితే ఈ ఆర్టికల్ చదివేయండి. లేడీస్ జీన్స్ కి ఈ పాకెట్స్ ని వేరే సెపరేట్ క్లాత్ తో కొడతారు. గతంలో కూడా అంటే.. 17వ నుండి 19వ శతాబ్దపు చివరి వరకు పాకెట్స్ తరచుగా మహిళల స్కర్ట్ క్రింద మరియు వారి అండర్-పెటికోట్ పైన ఇలాంటి పాకెట్స్ ని ప్రత్యేకంగా కుట్టేవారు.

jeans pocket 3

తరువాత మోడరన్ యుగంలో పురుషుల జీన్స్ లకి కూడా ఇలానే సెపరేట్ క్లాత్ ద్వారా పాకెట్స్ ని కుట్టడం ప్రారంభించేవారు. గతంలో ఈ పాకెట్స్ ఒకటే క్లాత్ లో లోపలకి కొంత ప్లేస్ లో కుట్టబడేవి. తర్వాత కాలంలో మహిళలు కూడా ఈ లోపల ఉండే పాకెట్స్ ని వాడడం తగ్గించారు. 1790 లలోనే ఈ పాకెట్స్ ఫ్యాషన్ తగ్గిపోయింది. 1800ల నాటికీ ఈ ట్రెండ్ బాగా తగ్గిపోయింది. తరువాత హ్యాండ్ బాగ్ ఫ్యాషన్ వచ్చింది.

jeans pocket 4

మహిళలు తమకు అవసరమైన వస్తువులను పాకెట్స్ లో కాకుండా హ్యాండ్ బాగ్స్ లో పెట్టుకోవడానికి మక్కువ చూపిస్తున్నారు. దీనితో పాకెట్స్ వాడకం తగ్గిపోయింది. పాకెట్స్ కూడా ఇపుడు ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయాయి. అందుకే అమ్మాయిల జీన్స్ తయారీలో పాకెట్స్ పై అంత ప్రత్యేక శ్రద్ధ చూపించరు. అందుకే అమ్మాయిల జీన్స్ పాకెట్స్ అబ్బాయిల పాకెట్స్ కంటే చిన్నవిగా ఉంటాయి.


You may also like