ఆయిల్/ నీటిని మోసుకొచ్చే ట్యాంకర్లు రౌండ్ షేప్ లోనే ఎందుకు ఉంటాయి..? అసలు కారణం ఇదే..!

ఆయిల్/ నీటిని మోసుకొచ్చే ట్యాంకర్లు రౌండ్ షేప్ లోనే ఎందుకు ఉంటాయి..? అసలు కారణం ఇదే..!

by Anudeep

Ads

మీరెప్పుడైనా గమనించారా..? వాటర్ ట్యాంకర్, ఆయిల్, పెట్రోల్ లేదా డీజిల్ వంటి ద్రవ పదార్ధాలను మోసుకొచ్చే లారీలు వెనక రౌండ్ షేప్ లో ఉన్న టాంకర్ ని కలిగి ఉంటాయి. ఎప్పుడైనా సరే ఇలాంటి వాటిని మోసుకురావాలంటే లారీలలో సెపరేట్ కంటైనర్లను ఉంచి తీసుకురారు. కచ్చితంగా సిలిండ్రికల్ షేప్ లో ఉన్న ట్యాంకర్లనే ఉపయోగిస్తారు. అయితే.. వీటినే ఎందుకు ఉపయోగిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం..

Video Advertisement

liquid containers 2

నీరు, ఆయిల్, గ్యాస్ వంటివాటిని ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి రవాణా చేయడానికి ఇలాంటి రౌండ్ షేప్ లో ఉన్న ట్యాంకర్లను ప్రత్యేకంగా డిజైన్ చేస్తారు. రవాణా చేయవలసిన ద్రవ రకాన్ని బట్టి ట్యాంక్ ట్రక్కుల యొక్క అనేక రకాలు ఉన్నాయి. ట్యాంక్ ట్రక్కులు పెద్దవిగా లేదా చిన్నవిగా, ఒత్తిడికి గురైనవి లేదా ఒత్తిడి లేనివి, ఇన్సులేట్ చేయబడినవి లేదా ఇన్సులేట్ చేయబడనివి ఇలా రకరకాలుగా ఉంటాయి.

liquid containers 1

రౌండ్ గా ఉండే ట్యాంకర్లపై ఒత్తిడి తక్కువ గా ఉంటుంది. అదే చదరంగం షేప్ లో కానీ, దీర్ఘ చతురస్రాకారంలో కానీ ఉండే ట్యాంకర్లలో వీక్ పాయింట్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా కార్నర్స్ వద్ద ఎక్కువ ఒత్తిడి పడే అవకాశం ఉంటుంది. దీనివల్ల రవాణా వేగంగా జరగకుండా ఇబ్బంది కలుగుతుంది. విమానాలలో కూడా కిటికీలు బస్సు, ట్రైన్ లలో లాగా దీర్ఘ చతురస్రాకారంలో కాకుండా.. రౌండ్ షేప్ లో ఉండడానికి ఇదే కారణం. ద్రవ పదార్ధాలు బరువు ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల ఆ బరువుని, ఒత్తిడిని తట్టుకుని లారీని నడపాల్సి ఉంటుంది. అందుకే ట్యాంకర్లను రౌండ్ షేప్ లోనే డిజైన్ చేస్తూ ఉంటారు.

liquid containers 3

మండే వాయువులు, ద్రవ పదార్ధాలు వంటివాటిని తీసుకెళ్లే వాహనం ఎక్కువ సేపు స్థిరత్వాన్ని కోల్పోకుండా ఉండాలి. అలా ఉండాలంటే.. గురుత్వాకర్షణ కేంద్రం భూమికి దగ్గరగా ఉండేవిధంగా చూసుకోవాలి. దీర్ఘచతురస్రాకారంలో ఉండే కంటైనర్లకంటే రౌండ్ షేప్ లో ఉండే కంటైనర్లు భూమికి ఎక్కువ దగ్గరగా ఉంటాయి. అందుకే ద్రవపదార్ధాల రవాణా కోసం రౌండ్ షేప్ లో ఉండే కంటైనర్లనే డిజైన్ చేస్తారు.


End of Article

You may also like