“శివపార్వతులకు” పిల్లలు ఉన్నట్లే “లక్ష్మి నారాయణులకు” పిల్లలు ఎందుకు లేరు..?

“శివపార్వతులకు” పిల్లలు ఉన్నట్లే “లక్ష్మి నారాయణులకు” పిల్లలు ఎందుకు లేరు..?

by Anudeep

దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం భగవంతుడు పలు రూపాలలో వచ్చి భక్తులను కాపాడుతూనే ఉంటాడనడానికి మన పురాణాలే సాక్ష్యాలు. ధర్మ రక్షణ కోసం ఎన్ని అవతారాలనైనా ఎత్తుతానని భగవంతుడు ఎప్పుడో చెప్పాడు. విష్ణుమూర్తి కూడా దశావతారాలను ఎత్తి ధర్మాన్ని సంరక్షించిన సంగతి మనందరికీ తెలుసు.

Video Advertisement

ఇక, శివపార్వతులు కూడా ఆది దంపతులుగా పేరు పొందారు. శరణని వచ్చిన భక్తులను నిత్యం కాపాడుతూనే ఉంటారు. వీరికి గణేశుడు, కుమార స్వామి సంతానంగా ఉన్న సంగతి తెలిసిందే.

sivaparvathi 1

గణేశుడు విఘ్నాలకు అధిపతిగా కొనసాగుతూ, విఘ్నేశ్వరుడై భక్తులను కాపాడుతూ ఉంటాడు. కుమార స్వామికి భూలోకంలో విశేష పూజలు అందుతూనే ఉన్నాయి. ఆయన శరవణుడిగా, మురుగన్ గా పలు ప్రాంతాల్లో పూజలు అందుకుంటూ.. సంతానం కు సంబంధించిన సమస్యలను, వినికిడికి సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తూ పూజలు అందుకుంటున్నారు.

sivaparvathi 2

మరి శివ పార్వతుల సంతానం కూడా దేవతలుగా పూజలు అందుకుంటుంటే.. సృష్టి రక్షకుడు అయిన ఆ నారాయణుడికి కూడా సంతానం ఉండాలి కదా..? లక్ష్మి నారాయణులకు ఎందుకు సంతానం లేరు? అని ఓ కోరా యూజర్ ప్రశ్నించారు. దానికి మరో కోరా యూజర్ అద్భుతమైన సమాధానం ఇచ్చారు. ఈ వివరణ అందరు తెలుసుకోవాల్సిందే.

sivaparvathi 3

వాస్తవానికి లక్ష్మి నారాయణులు అనేక అవతారాలను ఎత్తారు. అయితే.. ఈ అవతారాల్లోనే వారికి సంతానం కలిగింది. సీతా రాముల అవతారంలో లవ కుశలు, రుక్మిణి కృష్ణులకు ప్రద్యుమ్నుడు సంతానంగా కలిగారు. ఇక లక్ష్మి నారాయణులకు కూడా కామదేవుడు సంతానం అని చెబుతుంటారు. అంటే.. మనమంతా లక్ష్మి నారాయణులకు సంతానమే. అని ఆ కోరా యూజర్ సమాధానం ఇచ్చారు.


You may also like