Ads
హిందువులలో రామాయణం తెలియని వారు ఎవరు ఉండరు. హిందువులకు ఇది అత్యంత పవిత్రమైన పురాణం. శ్రీ రాముడు మానవుడు ఎలా నడుచుకోవాలో ఈ అవతారం లో నడిచి చూపించాడు. రాక్షసులను సంహరించడం, వనవాసం, సీతను వివాహం చేసుకోవడం, ఆమెను రావణుడు అపహరించడం, ఆమెను వెతకడానికి శ్రీరాముడు ఆంజనేయుడు, సుగ్రీవుల సాయం తీసుకోవడం, సీతమ్మ తల్లి తిరిగి అయోధ్యకు రావడం, ఆ తరువాత మరోసారి సీత అడవుల పాలు కావడం, లవకుశల జననం… ఇలా సాగిపోతుంది రామాయణం.
Video Advertisement
అయితే.. శ్రీరాముని జననం గురించి కూడా ప్రత్యేక కధనం ఉంది. దశరధ మహారాజుకు పిల్లలు లేకపోతే పుత్ర కామేష్టి యాగం చేస్తారు. ఆ యాగం జరుగుతుండగా యాగ పురుషుడు ఇచ్చిన పాయసాన్ని దశరధుని ముగ్గురి భార్యలు సేవిస్తారు. ఆ తరువాత గర్భవతులు అవుతారు.
అలా కౌసల్య గర్భవతియై నవమి తిధి రోజున శ్రీరామునికి జన్మనిస్తుంది. సాధారణంగా హిందూ సంప్రదాయంలో నవమి తిధిని మంచిది కాదు అని భావిస్తారు. కానీ, శ్రీ రాముడు జన్మించిన నవమి తిధి రోజున మాత్రం శ్రీరామనవమి పండుగగా జరుపుకుంటారు. శ్రీరాముడు త్రేతాయుగంలో జన్మించారు. ఈ యుగాన్ని వర్ణిస్తూ రాసిన కావ్యాన్ని రామాయణం అంటారు. ఈ రామాయణం అన్న పదానికి చివరలో ఆయనం అని ఉంటుంది. ఒక్క రామాయణానికి తప్ప ఇతర కాలాల్లో రచించబడ్డ ఏ గ్రంధానికి ఇలా ఉండదు.
కారణం ఏంటంటే.. రాముడు పరిపూర్ణ మానవుడు. మానవుడు ఎలా నడుచుకోవాలి అన్న విషయాన్నీ జీవించి చూపించాడు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ధర్మాన్ని వీడలేదు. ఎక్కడ తానూ దేవుడిని అని కానీ, దైవత్వాన్ని గాని ప్రకటించలేదు. అందుకే రామస్య ఆయనం రామాయణం అని పేర్కొన్నారు. ఇక రాముడు జన్మించిన నవమి విషయానికి వస్తే ఈ తిధికి ఓ ప్రత్యేకత ఉంది. నవమి అంటే 9 వ సంఖ్య కదా.. ఈ సంఖ్య పరమేశ్వర తత్వాన్ని చూపిస్తుంది. అంటే.. ఏ సంఖ్యతో హెచ్చరించినా వచ్చిన ఆ నంబర్స్ ను కలిపితే మళ్ళీ తొమ్మిదే వస్తుంది.
9*1=9
9*2=18 — 8+1 =9
9*3=27 — 2+7=9
9*4=36 — 3+6=9
9*5=45 — 4+5=9
పరమేశ్వరుడు ఎన్ని రూపాలలో ఉన్నా.. ఎన్ని అవతారాలు ఎత్తినా ఆయన అసలు తత్త్వం ఒక్కటే అని చెప్పడమే ఈ తిధి ప్రత్యేకత. అందుకే శ్రీ రామ చంద్రుడు ఈ తిధి రోజున జన్మించాడు. ఆయన జన్మించిన నవమి నాడు హిందువులంతా వేడుకగా జరుపుకుంటారు.
End of Article