రామాయణం భారతీయులకు ఎంతో పవిత్రమైన పురాణం గ్రంధం. అయితే, ఈ గ్రంధం లోని చాలా విషయాలు మనకు పాఠాల్ని నేర్పుతాయి. రామాయణానికి సంబంధించి కొన్ని విషయాలలో మనకి పూర్తి గా స్పష్టత లేదు. అందులో ఒకటి రావణుడి భార్య మండోదరి గురించి చాలా మందికి తెలియదు. రామ రావణ యుద్ధం లో రావణుడు మరణించాడు. ఆ తరువాత మండోదరి ఏమైంది అన్న విషయానికి ఎక్కడ వివరణ లేదు. అయితే, ఒక పురాణం ప్రకారం రావణుడి భార్య మండోదరి రావణుడు మరణించిన తరువాత రావణుడి తమ్ముడు విభీషణుడిని వివాహం చేసుకున్నదని తెలుస్తోంది.

వాస్తవానికి, రావణుడి భార్య మండోదరి పరమ పతివ్రత. ఆమె తన భర్తను తప్ప ఎవ్వరిని ఇష్టపడలేదు. కన్నెత్తి అయినా చూసేది కాదు. కానీ రాజైన రావణుడు మరణించిన తరువాత రాజ్యాధికార భారం ఆమె పై పడింది. సంతానం కూడా యుద్ధం లోనే మరణించారు. దీనితో ఆమె రాణి గా అధికారం చెలాయించాల్సి ఉంది. ప్రజల రక్షణ భారం తానె మోయాల్సి ఉంది. అప్పటి లంక నియమాల ప్రకారం మహారాణి మండోదరి కి రాజ్యాధికారం అప్పగించాల్సిందే. కానీ, విభీషణుడు లంకను పాలించగలడు. ఈ క్రమం లో మండోదరికి పెళ్లి చేసుకుని రాజ్యాధికారం తీసుకోవాలని శ్రీ రాముడే విభీషనుడికి సలహా ఇస్తాడు.

అయితే, రావణుడిని తప్ప మరొకరిని ఇష్టపడని మండోదరి ఈ వివాహాన్ని వ్యతిరేకిస్తుంది. తనకు ఇష్టం లేదని చెబుతుంది. అయితే, ఇది కేవలం అధికారికంగా మాత్రమే నని , లాంఛనప్రాయంగా జరిగే పెళ్లి తంతే తప్ప మరొకటి కాదని, అధికారాన్ని విభీషణుడికి ఇచ్చేందుకైనా ఈ వివాహాన్ని అంగీకరించాలని శ్రీ రాముడు మండోదరి చేత ఒప్పిస్తాడు. శ్రీ రాముడు చెప్పడం తో మండోదరి కూడా అంగీకరిస్తుంది. ఆ తరువాత కొంతకాలానికి పర్వతాలలోకి వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటుంది. అక్కడే తనువూ చాలించేస్తుంది.