ఈరోజుల్లో చాలా మంది నల్లపూసలు ఎందుకు వేసుకోవట్లేదు..? పెళ్లి అయ్యాక నల్లపూసలు తప్పనిసరిగా ధరించాలా?

ఈరోజుల్లో చాలా మంది నల్లపూసలు ఎందుకు వేసుకోవట్లేదు..? పెళ్లి అయ్యాక నల్లపూసలు తప్పనిసరిగా ధరించాలా?

by Anudeep

Ads

మహిళలు అలంకార ప్రియులు. ఫ్యాషన్ గా ఉండేవాళ్ళకి ట్రెండీ జ్యువెలరీ ఉండనే ఉంది.  మోడరన్ అమ్మాయి అయినా, క్లాసీ అమ్మాయి అయినా ఆభరణాలను చూస్తే మనసు పారేసుకోవడం మాత్రం ఖాయమే. అలాగే.. పెళ్లి అయిన తరువాత అమ్మాయిల వద్దకు కొత్త ఆభరణాలు ఆడ్ అవుతూ ఉంటాయి. నిత్యం ధరించే మంగళ సూత్రాలు, గాజులు, కాలి మెట్టెలు, నల్ల పూసలు లాంటివన్నమాట.

Video Advertisement

black beads

అయితే.. ప్రస్తుతం నడుస్తున్న మోడరన్ యుగం లో చాలా మంది నల్లపూసలు, కాలి మెట్టెలు ధరించడం లేదు. కొంతమంది అయితే అసలు మంగళసూత్రాలు ధరించడానికి కూడా ఆసక్తి కనబరచడం లేదు. అసలు ఇవి భారతీయ వివాహ సంప్రదాయం లో ఎందుకు పెట్టారు..? మంగళసూత్రాలు వేసుకుంటే సరిపోతుందా? నల్లపూసలు కూడా కచ్చితం గా వేసుకోవాలా? అన్నది ఈరోజు ఆర్టికల్ లో తెలుసుకుందాం.

black beads 2

హిందూ సంప్రదాయం లో నల్లపూసలు చాలా విశిష్టత ఉంది. పూర్వం నల్లపూసలని నల్ల మట్టితో తయారు చేసేవారు. ఈ పూసలు ఛాతి మీద వరకు వేసుకునే వారు. కొంతమంది మంగళసూత్రాలలోనే రెండు పెద్ద నల్లపూసలు, రెండు ఎర్ర పూసలు వేసేవారు. ఇవి ఛాతీ మీద వచ్చే ఉష్ణాన్ని పీల్చుకునేవి అనే నమ్మకం తో వీటిని ధరించేవారు. ఇప్పుడు వచ్చే నల్ల పూసలు తయారీ విధానమే మారిపోయింది. అయితే.. శాస్త్రం గురించి తెలిసిన వారు మాత్రం తమకోసం ప్రత్యేకం గా తయారు చేయించుకుంటున్నారు.

black beads 1

వివాహ సమయం లోనే అత్తింటివారు ఓ కన్యతో నల్లపూసలను కుట్టిస్తారు. వాటిని వధూవరులిద్దరి చేత నీల లోహిత గౌరీ దేవి ముందు ఉంచి పూజ చేయిస్తారు. వాటిని ధరించడం వలన నీల లోహిత గౌరీ దేవి అనుగ్రహం లభించి వారు జీవితాంతం కలిసి ఉంటారు అని శాస్త్రం చెబుతోంది. అయితే.. ఇప్పుడు మాత్రం పెళ్లి లో పూజ చేసిన నల్లపూసలను ఎక్కువ కాలం ధరించడం లేదు. బంగారం షాపుల్లో రెడీ మేడ్ గా చేసిన వాటినే కొనుక్కుని వేసుకుంటున్నారు. మన పెద్దలు ఏమి చెప్పినా.. దాన్ని ఎంతో దూరం ఆలోచించి, ఆచరించే చెప్పారు. అందుకే వారు చెప్పినట్లే పాటించడం ఉత్తమం.


End of Article

You may also like