గుండెజబ్బులు మగవారికి మాత్రమే ఎక్కువగా ఎందుకు వస్తుంటాయి? దీని వెనుక కారణం ఏంటంటే?

గుండెజబ్బులు మగవారికి మాత్రమే ఎక్కువగా ఎందుకు వస్తుంటాయి? దీని వెనుక కారణం ఏంటంటే?

by Anudeep

Ads

ఈ మధ్యకాలంలో గుండెపోట్లు ఎక్కువగా వస్తున్నాయి. అయితే మంచి ఆహారం తీసుకోవడం, సరైన జీవన విధానాన్ని పాటించడం చేస్తే అనారోగ్య సమస్యల నుండి బయట పడవచ్చు. ఇది వరకు అయితే అధిక వయసు ఉన్న వాళ్లకి గుండెపోటు ఎక్కువగా వచ్చేది.

Video Advertisement

కానీ ఇప్పుడు యుక్తవయసు వాళ్ళకి కూడా గుండెపోటు సమస్య ఎక్కువ అయ్యింది. చాలా మందికి బాత్రూంలోనే గుండెపోటుతో కుప్పకూలిపోతున్నారు. ఇంకా ఆడవారిలో కంటే ఎక్కువగా మగవారిలో గుండెపోటు వస్తుండడం గమనిస్తున్నాం.

Difference between heart attack and cardiac arrest

నిజానికి మగవారి గుండెకి, ఆడవారి గుండెకి ఎటువంటి బేధం లేదు. మహిళ యొక్క గుండె సాధారణంగా చిన్నదిగా ఉంటుంది, దానిలోని కొన్ని అంతర్గత గదులు ఉంటాయి. ఈ గదులను విభజించే గోడలు సన్నగా ఉంటాయి. మరియు ఒక స్త్రీ యొక్క గుండె పురుషుడి కంటే వేగంగా పంప్ చేస్తుంది. ఒక స్త్రీ గుండె ప్రతి స్క్వీజ్‌తో 10% తక్కువ రక్తాన్ని బయటకు పంపుతుంది. ఒత్తిడికి గురి అయినప్పుడు, మహిళల పల్స్ రేటు పెరుగుతుంది మరియు వారి గుండె మరింత రక్తాన్ని పంపుతుంది.

కానీ పురుషులలో ఇలా కాదు. పురుషులు ఒత్తిడికి గురి అయినప్పుడు వారి గుండె ధమనులు కుంచించుకుపోతాయి మరియు వారి రక్తపోటు పెరుగుతూ ఉంటుంది. కరోనరీ ఆర్టరీ వ్యాధి (CAD) యొక్క లక్షణాలు, చికిత్సలు మరియు ఫలితాలలో జెండర్ కూడా కీలక పాత్ర పోషిస్తోంది. ఈ వ్యత్యసాల వలన పురుషులలో స్త్రీలకంటే ఎక్కువగా గుండెపోటు నమోదు అయ్యే అవకాశం ఉంటోందని భావించాల్సి వస్తోంది. ఆడవారిలో కూడా గుండెపోటు కేసులు నమోదవుతున్నాయి. కానీ.. వారిలో ఎక్కువగా మెనోపాజ్ దశ దాటిన తరువాత మాత్రమే ఈ వ్యాధి వస్తోంది. ఇంకా.. గుండెపోటు లక్షణాలు మగవారిలో, ఆడవారిలో వేరు వేరుగా ఉంటున్నాయి. కానీ మగవారిలో కంటే.. ఆడవారిలో కలిగే గుండెపోటు వలన వచ్చే నొప్పి ఎక్కువగా ఉంటోంది. గుండెపోటుతో బాధపడుతున్న స్త్రీలకు మధుమేహం లేదా అధిక రక్తపోటు వంటి చికిత్స లేని వ్యాధులు కూడా ఉండడం ఓ కారణం కావచ్చు.


End of Article

You may also like