Ads
ప్రస్తుతం మొబైల్ ఫోన్ వాడకం ఎక్కువగానే ఉంది. స్మార్ట్ ఫోన్ లేని వ్యక్తులు ఎవరు ఉండడం లేదు. అయితే.. ఈ స్మార్ట్ ఫోన్ లను జాగ్రత్తగా వాడుకుంటే ఎక్కువ కాలం వస్తాయి. అందుకే.. అందరు స్మార్ట్ ఫోన్ లకు ఫోన్ పౌచ్ లను తొడిగేస్తూ ఉంటారు.
Video Advertisement
అయితే వీటిలో చాలా రకాలు ఉన్నప్పటికీ ఎక్కువ మంది ట్రాన్స్పరెంట్ మొబైల్ కవర్లను వినియోగిస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ కవర్లు కొన్న మొదట్లో తెల్లగానే ఉంటాయి. మనం వాడుతున్న కొద్దీ.. కొన్నిరోజులు పసుపు రంగులోకి మారిపోవడం మనం గమనిస్తూనే ఉంటాం. ఇలా ఎందుకు జరుగుతుందో.. ఇప్పుడు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
సూర్యరశ్మి, వేడి లేదా కొన్ని రసాయనాలు తగలడం వల్ల కానీ ఈ ట్రాన్స్పరెంట్ ఫోన్ కేస్ లు పసుపు రంగులోకి మారతాయి. ఎక్కువ వేడి తగలడం వలన కేస్‌లోని రసాయనాలు అధోకరణం చెందుతాయి. దీనివలన అది పసుపు రంగులోకి మారిపోతుంది. సూర్యుడి నుండి వచ్చే UV కాంతి కూడా రసాయనాలను ప్రభావితం చెయ్యగలదు. దీనివల్ల కేస్ క్వాలిటీ ఏమైనా మారుతుందా..? అని ఆలోచిస్తే.. క్వాలిటీ మాత్రం కచ్చితంగా మారదు.
కానీ, కేస్ తయారీలో ఉపయోగించిన రసాయనాల కారణంగా రంగు మాత్రం మారే అవకాశం ఉంటుంది. అలాగే, చేతి నుండి చెమట లేదా ముఖం చర్మం నుండి విడుదల అయ్యే ఆయిల్స్ కూడా ఈ కేస్ లు రంగు మారడానికి కారణం అవ్వొచ్చు. అయితే వీటి వలన కేస్ రంగు మాత్రమే ప్రభావితం అవుతుంది తప్ప.. దాని మన్నికకు ఎలాంటి నష్టం వాటిల్లదు.
End of Article