కొత్తగా పెళ్ళైన జంటతో “సత్యనారాయణ వ్రతం” ఎందుకు చేయిస్తారో తెలుసా..?

కొత్తగా పెళ్ళైన జంటతో “సత్యనారాయణ వ్రతం” ఎందుకు చేయిస్తారో తెలుసా..?

by Anudeep

Ads

భారతీయ సంప్రదాయం లో ప్రతి పనికి కారణాలు, వెనుక నిగూడార్ధాలు ఎన్నో ఉంటాయి. ప్రతి ఇంట్లో ఎంతో వేడుక గా జరిగే పెళ్లి తంతులో ఇలాంటివి అడుగడుగునా కనిపిస్తాయి. అలాగే, పెళ్లి అయిన తరువాత కోడలిని అత్తవారింటికి తీసికెళ్ళి ఆ తరువాత, కొడుకు కోడలిని ఇద్దరినీ పీటలపై కూర్చోపెట్టి సత్యనారాయణ వ్రతం చేయిస్తారు. ఆ తరువాతే మళ్ళీ పుట్టింటికి తీసుకొస్తారు. ఇలా ఎందుకు చేయిస్తారో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

Video Advertisement

కోరిన కొరికేలు తీర్చే సత్యనారాయణ స్వామి భక్త సులభుడు. ఎలాంటి ఆటంకాలు లేకుండా, జీవితాన్ని గడపడానికి, అవసరమైన సామాగ్రిని సమకూర్చుకోవడానికి సత్యనారాయణ స్వామి అనుగ్రహం ఉండాలి. సాధారణం గా దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి కార్తీక మాసం లో సత్యనారాయణ వ్రతాన్ని ఆచరిస్తారు. అలా చేస్తే సకల శుభాలు చేకూరుతాయని విశ్వసిస్తారు. త్రిమూర్తులు ఇక రూపం లో దర్శనం ఇచ్చే అవతారాన్నే సత్యనారాయణ స్వామీ గా కొలుస్తారు. కొత్త గా పెళ్లి అయిన దంపతుల చేత ఈ వ్రతం చేయిస్తే వారి జీవితం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా, కలహాలు రాకుండా సత్యనారాయణ స్వామి కాపాడతారని హిందువులు విశ్వసిస్తారు.

అందుకే పెళ్లి అవ్వగానే, కొడుకు కోడలి తో ఈ వ్రతం చేయిస్తారు. ఈ వ్రతం చేసే రోజున ఊరి ప్రజలందరినీ పిలుస్తారు. ఈ సందర్భం గా తమ కోడలిని పరిచయం చేసినట్లు అవుతుంది. అలాగే, కోడలి కి కూడా ఊరి ప్రజలు పరిచయం అవుతారు. అందరితో యిట్టె కలిసి పోవడానికి ఆమెకు అవకాశం లభిస్తుంది.


End of Article

You may also like