Ads
ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ వాడని వ్యక్తి అంటూ ఎవరు ఉండడం లేదు. ఇంటికొక స్మార్ట్ ఫోన్ అయినా ఉంటుంది. అయితే.. మొన్నామధ్య వరకు వచ్చిన స్మార్ట్ ఫోన్ లలో బాటరీ ఉండేది. ఏదైనా సమస్య వచ్చినా ఆ బాటరీ తీసేసి కొత్త బాటరీ వేసుకునే వారు. ఛార్జింగ్ ఎక్కువ గా ఉండడం, లేక అసలు లేకపోవడం వంటి కారణాల వలన ఈ బ్యాటరీలు పాడయినా, కొత్తవి మార్చుకునే వెసులుబాటు వలన ఇబ్బంది ఉండేది కాదు.
Video Advertisement
రెండు బ్యాటరీలను కూడా కొందరు మైంటైన్ చేసే వారు. ఎప్పుడైనా దూర ప్రాంతాలకు వెళ్ళినపుడు, ఛార్జింగ్ పెట్టుకునే వీలు లేనపుడు బాటరీ ని మార్చుకుంటే సరిపోయేది. అయితే.. ఈ మధ్య కాలం లో వస్తున్నా స్మార్ట్ ఫోన్ లు అన్ని నాన్ రిమూవబుల్ బాటరీ ఫోన్లే. వేటికీ బాటరీ మార్చుకునే వెసులుబాటు ఉండడం లేదు. అయితే ఇలా ఎందుకు చేస్తున్నారు అనే విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మీరు గమనించారా..? గతం తో పోలిస్తే ఇప్పుడు వచ్చే స్మార్ట్ ఫోన్ లు అన్ని వెయిట్ లెస్ గా ఉంటున్నాయి. గతం లో వచ్చే ఫోన్ లలో బాటరీ ని పెట్టడం కోసం ప్రత్యేక సెటప్ చేయాల్సి వచ్చేది. దీనితో బాటరీ బరువు కూడా యాడ్ అవడం వలన ఫోన్ బరువు ఎక్కువ గా ఉండేది. అసలు ఈ అవసరం లేకపోవడం వలన ఇప్పుడు వచ్చే ఫోన్ లు చాలా స్మార్ట్ లుక్ తో బరువు తక్కువ గా , క్యారీ చేయడానికి ఈజీ గా ఉంటున్నాయి.
అలాగే, గతం లో బాటరీ మార్చడం కోసం, లేదా ఏదైనా అవసరం కోసం పదే పదే బ్యాక్ సైడ్ ఉంటె కాప్ ను ఓపెన్ చేసే వారు. దీనివలన కొన్ని సార్లు ఫోన్ లు పాడైపోతు ఉండేవి. అలాగే, కొన్ని ఫోన్లకు సిమ్ కార్డు మార్చాలన్న కూడా ఈ బ్యాక్ కాప్ ను ఓపెన్ చేసి బాటరీ తీసి పెట్టాల్సి ఉండేది. ఇప్పుడు ఆ అవసరం లేకుండా నాన్ రిమూవబుల్ బాటరీ స్మార్ట్ ఫోన్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఇవే కాకుండా మరొక రీజన్ కూడా ఉంది. ఓల్డ్ మోడల్ ఫోన్స్ అయితే.. అవి ఎప్పుడైనా పోతే.. ఆ ఫోన్ దొరికిన వారు సింపుల్ గా బాటరీ ని తీసేస్తారు. అలాంటప్పుడు మనం ఆ ఫోన్ ను ట్రాక్ చేయలేము. అదే నాన్ రిమూవబుల్ బాటరీ స్మార్ట్ ఫోన్స్ అయితే.. ఫోన్ లో ఒకసారి జిపిఎస్ ఆన్ చేసి ఉంచితే.. మీ ఫోన్ పోయినప్పుడు.. దానిని ఎక్కడ ఉన్నా ఈజీ గా ట్రాక్ చేసి పెట్టుకోవచ్చు. ఇలాంటి ఫీచర్స్ అన్ని నాన్ రిమూవబుల్ బాటరీ డిజైన్ తో ఉండే అప్డేటెడ్ మొబైల్స్ లోనే లభిస్తున్నాయి.
End of Article