కాలిక్యులేటర్ వచ్చాక మన చదువులు చాలా తేలికైపోయాయి కదా. చదువులే కాదు, కిరానా కొట్టు వ్యాపారాలు, షాపింగ్ మాల్స్, అకౌంటెంట్ లు.. ఇలా అందరి పని తేలికైపోయింది. ఎంత పెద్ద నెంబర్ అయినా సరే క్షణాల్లో కాలిక్యులేషన్ చేసేస్తాం. చాలా టైం ని ఆదా చేసుకుంటున్నాం. కాలేజీ డేస్ లో ఉన్నపుడు కాలిక్యులేటర్ ని విడిగా మోసుకెళ్ళేవాళ్ళం.. ఇపుడు ఆ అవసరం కూడా లేదు. మన ఫోన్ లో అనే కాలిక్యులేట్ చేసేస్తున్నాం.

phone vs caluculator 1

అయితే.. మీరొక విషయాన్నీ ఎప్పుడైనా గమనించారా..? ఫోన్ కీ పాడ్ లో ఉండే నంబర్స్ కి.. కాలిక్యులేటర్ కీ పాడ్ లో ఉండే నంబర్స్ కి తేడా ఉంటుంది. ఇవి రెండు రివర్స్ లో ఉంటాయి. ఫోన్ లో పైనుంచి కిందకి నంబర్స్ వరుసగా ఉంటె.. కాలిక్యులేటర్ లో కింద నుంచి పైకి ఉంటాయి. ఇలా ఎందుకు ఉంటాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

phone vs caluculator 2

టెలిఫోన్ లు కీప్యాడ్ సర్క్యూట్ మరియు టోన్-రికగ్నిషన్ హార్డ్‌వేర్‌తో పని చేస్తుంటాయి. 1950 ల చివరలో టచ్ టెలిఫోన్ లు విశేష ఆదరణ పొందుతున్న సమయం లోనే కాలిక్యులేటర్ లకు 7, 8 మరియు 9 సంఖ్యలను ఎగువ లో ఉండే విధం గా డిజైన్ చేసారు. ఈ లే అవుట్ లోనే డేటా ఎంట్రీ నిపుణులు, కాలిక్యులేటర్ వినియోగదారులు ప్రావీణ్యత ని పొందారు. ఈ ఫార్మాట్ డేటా ఎంట్రీ కి ఎంతో అనువు గా ఉండేది. కానీ, ఫోన్ చేసుకోవడానికి ఈ ఫార్మాట్ అంత అనువు గా అనిపించలేదు.

phone vs caluculator 4

దీనితో కాలిక్యులేటర్ కి రివర్స్ లోను, ఫోన్ డైల్ పాడ్ కి నార్మల్ గా ను నెంబర్స్ ఉండే విధం గా డిజైన్ చేసారు. ఫోన్ డయల్ పాడ్ లలో లాగ, కాలిక్యులేటర్స్ కి ఉంచితే.. నంబర్స్ ను టైపు చేస్తున్నపుడు టోన్-రికగ్నిషన్ టెక్నాలజీ సమర్థవంతంగా పనిచేయలేదు. దీనితో, కాలిక్యులేటర్ కు తొలుత ఉపయోగించిన రివర్స్ ఫార్మాట్ నే ఉపయోగిస్తున్నారు.

phone vs caluculator 5

ఇందుకు సంబంధించిన వివరణను బెల్ లాబ్స్ అధ్యయనం తెలుపుతోంది. బెల్ ల్యాబ్స్ నిర్వహించిన అధ్యయనంలో “పుష్బటన్ టెలిఫోన్ సెట్స్ యొక్క డిజైన్ అండ్ యూజ్ యొక్క హ్యూమన్ ఫాక్టర్ ఇంజనీరింగ్ స్టడీస్” అనే చాప్టర్ లో ఇందుకు సంబంధించి ఒక వివరణ ఉంది. ఇది జూలై 1960 లో ప్రచురించబడింది, ఇది పరిశోధకులు 5X2 మాతృకతో సహా అడ్డంగా లేదా నిలువుగా అమర్చబడిన వివిధ లేఅవుట్‌లను ప్రయత్నించారు. దిగువన ‘సున్నా’ తో 3X3 మాతృక కూడా ఉంది. పై వరుసలో 1-2-3తో ఉన్న 3X3 వెర్షన్ ప్రజలు ప్రావీణ్యం పొందటానికి సులభమైనదని తెలుస్తోంది.

calculator

అయితే, వీరు ప్రయత్నం చేసిన అన్ని లే అవుట్ ల కంటే రివర్స్ ఫార్మాట్ లో ఉన్న లే అవుట్ మాత్రం ఉత్తమ ఫలితాలను ఇచ్చింది. అందుకే అదే ఫార్మాట్ లో కాలిక్యులేటర్లను రూపొందిస్తుంటారు.