సర్జరీ చేసే రోజున పేషెంట్ కి కనీసం మంచినీళ్లు కూడా ఎందుకు ఇవ్వరు..? దీని వెనుక అసలు కారణం ఏంటో తెలుసా..?

సర్జరీ చేసే రోజున పేషెంట్ కి కనీసం మంచినీళ్లు కూడా ఎందుకు ఇవ్వరు..? దీని వెనుక అసలు కారణం ఏంటో తెలుసా..?

by Anudeep

Ads

మనం ఆరోగ్యంగా ఉండాలని పదే పదే కోరుకుంటూ ఉంటాం. ఏ చిన్న ఇబ్బంది వచ్చినా వెంటనే చెక్ చేయించుకుని అవసరమైన మందులు వాడుతూ ఉంటాం. ఒక్కోసారి సమస్య పెద్దదైనప్పుడో.. లేక, యాక్సిడెంట్స్ వంటివాటిని ఎదురుకోవాల్సి వచ్చినప్పుడో ఒక్కోసారి మనకి సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం పడుతుంది.

Video Advertisement

అయితే మీరెప్పుడైనా గమనించారా..? ఇలా సర్జరీ చేయించుకోవాల్సినపుడు సర్జరీ చేసే రోజు ఉదయం నుంచి ఎటువంటి ఆహారాన్ని తీసుకోనివ్వరు. ఆహారమే కాదు.. కనీసం పచ్చి మంచినీళ్ళని అయినా ముట్టనివ్వరు.

surgery 1

ఇలా ఎందుకు చేస్తారో మీకెప్పుడైనా అనుమానం వచ్చిందా..? సర్జరీ రోజున ఎందుకు పస్తు ఉంచుతారు..? అలాగే సర్జరీ అయిన తరువాత కూడా వెంటనే ఫుడ్ ఇవ్వరు. ఇలా ఎందుకు చేస్తారో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. సాధారణంగా ఏ సర్జరీ చేసే ముందు అయినా నొప్పి తెలియకుండా ఉండడం కోసం మత్తు ఇస్తారు. ఈ మత్తు వలన శరీరంలో జీవక్రియ మందగిస్తుంది.

surgery 2

దీనితో మనం సర్జరీకి ఏమైనా తిన్నా లేక మంచినీరు తాగినా సర్జరీ అవ్వగానే వాంతులు అయిపోయి ఇబ్బంది అవుతుంది. అలా మత్తు మందు ఇచ్చినపుడు పొట్టలో ఉండే ఆహరం ఊపిరితిత్తుల వైపుకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా జరిగితే, సర్జరీ టైం లో ఇబ్బందులు రావడమే కాకుండా, సర్జరీ అయ్యాక వాంతులు అవడం, మోషన్స్ అవడం లాంటివి జరుగుతాయి.

surgery 3

జీవక్రియలు కూడా మందగించడం వల్ల ఆ సమయంలో ఊపిరితిత్తుల్లో ఆహారం చేరితే… శ్వాస స్తంభించి ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉంటుంది. కొన్నిసార్లు ఇన్ఫెక్షన్లు దరిచేరే అవకాశం ఉంటుంది. అందుకే సర్జరీ అయ్యాక కూడా ఆహారాన్ని పెట్టరు. బలం కోసం సెలైన్ ని మాత్రం పెడతారు. అదే ఆహరం.

 


End of Article

You may also like