జేబులో పెట్టుకున్న పెన్ “ఇంక్” ఎందుకు “లీక్” అవుతుందో తెలుసా? వెనకున్న కారణం ఇదే.!

జేబులో పెట్టుకున్న పెన్ “ఇంక్” ఎందుకు “లీక్” అవుతుందో తెలుసా? వెనకున్న కారణం ఇదే.!

by Anudeep

Ads

ఎప్పుడైనా షర్ట్ పాకెట్లో పెన్ను పెట్టుకుని , పొరపాటున మర్చిపోయామనుకోండి . ఇక అంతే సంగతి, షర్ట్ పాకెట్లో పెన్ నుండి ఇంక్ లీక్ అయిపోతుంది. దానివల్ల షర్ట్ పాడైపోతుంది. మరొక సారి వాడడానికి పనికి రాదు. ఇంకు మరకలు ఎటువంటి డిటర్జెంట్ తో ఉతికినా పూర్తిగా పొగొట్టడం అసాధ్యం. అది మన కొత్త షర్ట్ అనుకోండి ఆ బాధ మామూలుగా ఉండదు. మనమీద మనకే కోపం వస్తుంది. ఛా అనవసరంగా ఫెట్టుకున్నాను జేబులో , అని మనల్ని మనం తిట్టుకుంటాం.

Video Advertisement

కానీ అసలు పెన్ ఎందుకు లీకవుతుంది అని ఎప్పుడైనా ఆలోచించారా? ఇలా పాకెట్లో పెట్టుకున్నప్పుడు పెన్ లీకవడం వెనుక రెండు కారణాలున్నాయి అవేంటంటే …ఒకటి టెంపరేఛర్. అవును, మన బాడీ టెంపరేచర్ ఒక రీజన్. షర్ట్ లో పెన్ పెట్టుకున్నప్పుడు అది మన బాడీకి దగ్గరగా ఉంటుంది. దాని వల్ల మన శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే, పెన్లో ఇంక్ కూడా వేడి అయి కరిగి రీఫిల్ నుండి లీకవుతుంది. పెన్ నిబ్ (ములికి వైపు ) కూడా లీక్ అవ్వడానికి రీజన్ ఇంక్ వేడై కరగడం వలనే. అందుకే షర్ట్లో పెన్ను పెట్టుకున్న ప్రతిసారి పెన్ లీకవదు. ఎప్పుడైనా మన బాడీ టెంపరేచర్ ఎక్కువగా ఉన్నప్పుడు అవుతుంది.

రెండవది కాపిల్లరి యాక్షన్ (కేషనాళిక చర్య) . వేడి అయిన ఇంక్ ఎటువంటి ఫోర్స్ లేకపోయినా కిందికి జారుతుంది. ద్రవరూప పదార్దం ఎంతటి సన్నని దారుల గుండా అయినా ప్రవహించగలుగుతుంది. దీనికి గ్రావిటి (గురుత్వాకర్షణ) అనేది అక్కర్లేదు. అదే ఇక్కడ కూడా పనిచేస్తుంది. ఇదీ పెన్ లో ఇంక్ లీక్ అవ్వడం వెనుక ఉన్న రీజన్ . కాబట్టి ఇకపై పెన్స్ తో జాగ్రత్త మీరు కాదండీ మీ విలువైన షర్ట్స్..

 


End of Article

You may also like