అమావాస్య రోజు అంత్య క్రియలు ఎందుకు చేయరు..? దీని వెనుక ఇంత కారణం ఉందా..?

అమావాస్య రోజు అంత్య క్రియలు ఎందుకు చేయరు..? దీని వెనుక ఇంత కారణం ఉందా..?

by Anudeep

Ads

జీవితంలో మనిషికి ముఖ్యమైనవి రెండే రెండు రోజులు. ఒకటి తను ప్రపంచంలోకి అడుగుపెట్టిన రోజు. ఇంకొకటి తను ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయిన రోజు. అంటే జననం ఇంకా మరణం. పుట్టిన తర్వాత బారసాల అన్నప్రాసన, చనిపోయిన తర్వాత అంత్యక్రియలు మనిషి ప్రమేయం లేకుండానే జరిగిపోతాయి.

Video Advertisement

పుట్టిన తర్వాత జరిగే ఈ కార్యక్రమానికి ఒక కారణం సందర్భం ఉంటుంది. చనిపోయిన తర్వాత చేసే అంతక్రియలు లో పాటించే కొన్ని విధులకు కూడా ప్రత్యేకమైన కారణం ఉంటుంది.

final rituals 1

చాలా సందర్భాలలో.. మనిషి చనిపోయిన తరువాత ఆ వ్యక్తి శవాన్ని ఇంటికి తీసుకు వచ్చి అదే రోజున అంత్య క్రియలు నిర్వహించేస్తారు. ఎవరైనా ముఖ్యులు రావాల్సిన వారు ఉంటె తప్ప.. అంత్య క్రియలను వాయిదా వేయడం అంటూ ఉండదు. కానీ, వారు అమావాస్య రోజున మరణిస్తే మాత్రం ఆరోజున దహన సంస్కారాలు చేయరు. ఒకవేళ చేయాలని అనుకున్నా చుట్టుపక్కల వాళ్ళు చేయనివ్వరు. ఇలా ఆరోజు అంత్యక్రియలు చేయకపోవడం వెనుక హిందూ సంప్రదాయంలో కొన్ని విశ్వాసాలు ఉన్నాయి. అమావాస్య రోజు అంత్యక్రియలు చేయడం వలన అరిష్టాలు సంభవిస్తాయని హిందువులు నమ్ముతారు. అంతే కాదు.. ఆరోజు అంత్య క్రియలు చేస్తే మరణించిన వారి ఆత్మ శాంతించదని, పరలోకాలకు వెళ్ళదని.. భూమిపైనే దెయ్యమై సంచరిస్తూ ఉంటుందని నమ్ముతారు. అందుకే ఆరోజు అంత్య క్రియలు చేయడానికి ఎవరూ సాహసించరు.

final rituals 2

అంతేకాదు అమావాస్య రోజు చేయకూడని పనులు చాలానే ఉన్నాయి. ఆరోజున మధ్యాహ్న సమయంలో నిద్రించకూడదు అని చెబుతున్నారు. ఆరోజు రాత్రి భోజనం చేయరాదని.. దారిద్య్రానికి కారణమవుతుందని చెబుతున్నారు. గడ్డం గీసుకోవడం, గోళ్లు కత్తిరించుకోవడం, జుట్టు కత్తిరించుకోవడం, సాయం సమయాల్లో నూనె రాసుకోవడం మంచిది కాదని చెబుతుంటారు. ఇలా చాలా మూఢనమ్మకాలు ఉన్నాయి. ఇక కొందరైతే శవం ఎదురు వస్తే మంచిది కాదని అనుకుంటూ ఉంటారు. కానీ.. బయటకి వెళ్తున్నప్పుడు శవం ఎదురు వస్తే మంచిదట. వెళ్తున్న పనిని పూర్తి చేసుకుని రావాలని పండితులు చెబుతున్నారు.

final rituals 3

తల్లి తండ్రులు లేని వారు కచ్చితంగా తమ పెద్దల పేర్లు చెప్పుకుని నీరుని వదలాల్సిందే. అలా చేయకపోవడం వలన దారిద్య్రం సంభవిస్తుంది. అలాగే అంత్య క్రియలు పూర్తి అయిన తరువాత కొందరు వ్యక్తులు కాటికాపరులకు సరిగా డబ్బుని చెల్లించరు. తక్కువ మొత్తంలోనే ఇస్తుంటారు. ఈ వృత్తిని ఒక్క కులం వారే తీసుకుంటూ ఉంటారు. కుల వృత్తిగా ఆచారం వస్తున్నా వారే ఈ వృత్తిని చేపడుతుంటారు.


End of Article

You may also like