Ads
ప్రపంచవ్యాప్తంగా క్రూడాయిల్ ధరలు స్థిరంగా పెరుగుతున్నాయి. క్రూడాయిల్ పెరుగుతుండటంతో.. ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు మండుతున్నాయి. అయితే పెట్రోల్, డీజీల్ మధ్య తేడా ఏంటన్నది చాలా మందికి తెలియదు. తరచూ ఈ రెండు ఇంధనాలను వాడుతాం కానీ అసలు రెండింటి మధ్య తేడా ఏంటని అడిగితే మాత్రం చెప్పలేం. రెండు ఇంధనాల మధ్య చిన్నపాటి తేడా ఉంది కాబట్టే వాటిని విడిగా చేసి వాడుతుంటారు. ఇప్పుడు వాటి మధ్య తేడాలేంటో.. ఎందుకు పెట్రోల్ ప్రైస్ డీజిల్ కన్నా తక్కువగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..
Video Advertisement
భూమిలొ దొరికే ముడి చమురు నుండి ఫ్రాక్షనల్ డిస్లేషన్ అనే పద్ధతి ద్వారా పెట్రోల్ మరియు డీజిల్ లను తయారు చేస్తారు. ముందుగా డీజిల్ లభిస్తుంది. ఆ తరవాత పెట్రోల్ లభిస్తుంది. డీజిల్ కు ఎక్కువ టార్క్ ఉంటుంది. పెట్రోల్ లో అయితే టార్క్ తక్కువగా ఉంటుంది. టార్క్ ఎక్కువ బరువును తీసుకువెళ్లే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. టార్క్ అంటే రొటేటింగ్ ఫోర్స్ అని అర్థం. ఈ టార్క్ ఉండటం వల్లే డీజిల్ ను హెవీ వెయికిల్స్ లారీలు, బస్సుల్లో వాడుతుంటారు. టార్క్ ఎక్కువగా ఉండటం వల్ల ఎత్తైన ప్రదేశాల్లో,ఘాట్ రోడ్డుల్లో ప్రయాణించవచ్చు. అందుకే భారీ వాహనాల్లో డీజిల్ ని ఉపయోగిస్తారు.
పెట్రోల్ కన్నా డీజిల్ ప్రాసెస్ కాస్ట్ ఎక్కువే అయినా డీజిల్ కి తక్కువ టాక్స్ లు ఉంటాయి. అలాగే డీజిల్ వినియోగం కూడా ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ డీజిల్ ధర పెరిగినట్లయితే అది ఉత్పత్తి రంగం పై ప్రభావం చూపిస్తుంది. తద్వారా ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయ్యి ద్రవ్యోల్బణం వస్తుంది. అంతే కాకుండా డీజిల్ చిక్కగా ఉంటుంది. అందువల్ల డీజిల్ మెల్లిగా ఆవిరవుతుంది. అందువల్లే ఎకనామికల్ గా కూడా డీజిల్ ఉత్తమమైనది. డీజిల్ ఇంజన్లకు ఎక్కువ మెయింటెనెన్స్ ఉంటుంది. అదే విధంగా పెట్రోల్ ఇంజన్లకు తక్కువ మెయింటెనెన్స్ ఉంటుంది. కాబట్టి బైక్ కంటే కార్లు ఇతర పెద్ద వాహనాలు కొన్నట్లైతే వాటికి మెయింటెనెన్స్ ఎక్కువ అని చెబుతుంటారు.
పెట్రోల్ ఇంజన్లు వేగంగా పనిచేస్తాయి. అందువల్లే గాడిదలా ఎక్కువ పనిచేయాలని పెద్ద వాహనాలకు డీజిల్ ఇంజన్లను వాడుతుంటారు. ఇక తక్కువ పని వేగంగా చేయాలని బైకులకు పెట్రోల్ ఇంజన్లను వాడుతుంటారు. కాకపోతే డీజిల్ నుండి ప్రకృతికి హాని కలిగించే వాయువులు ఎక్కువగా వెలుబడతాయి. అయితే గతంలో పెట్రోల్ కంటే డీజిల్ ధర చాలా తక్కువగా ఉండేది. కానీ అంతర్జాతీయ మార్కెట్ కారణంగా డీజిల్ ధర కూడా పెట్రోల్ ధర సమీపానికి వచ్చింది.
End of Article