యుద్ధ విమానాలు నడిపే పైలట్లు మోకాళ్ల‌కు ఆ బోర్డులు ఎందుకు ధరిస్తారు..? ఆ బోర్డుల్లో ఏమున్నాయో తెలుసా..?

యుద్ధ విమానాలు నడిపే పైలట్లు మోకాళ్ల‌కు ఆ బోర్డులు ఎందుకు ధరిస్తారు..? ఆ బోర్డుల్లో ఏమున్నాయో తెలుసా..?

by Anudeep

Ads

ఇటీవలే రాఫెల్ యుద్ధ విమానాలు భారత్ కు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ యుద్ధ విమానాలు, వాటిని నడిపిన పైలట్ల ఫోటోలు కూడా నెట్టింట్లో వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలు చూసిన అందరికి వారి మోకాలికి ఉన్న నీ బోర్డులు ఏమిటి అనే సందేహం కలిగింది. ఈ పైలట్లు ఆ నీ బోర్డు పేపర్లను ఎందుకు ధరించారు..? వాటిలో ఏముంది..? అని చాలా మంది చర్చలు జరుపుకున్నారు.

Video Advertisement

rafel 1

ఇలా పైలట్లు మోకాలికి పెట్టుకునే పేపర్లను నీ బోర్డులంటారు. సాధారణం గా జెట్ విమానాలను నడిపేటప్పుడు పైలట్లు ఇలాంటి నీ బోర్డులను ధరిస్తారు. ఎందుకంటే, రాఫెల్ లాంటి జెట్ విమానాలలో పైలట్ కూర్చునే చోట స్పేస్ చాలా తక్కువ గా ఉంటుంది.

rafel 2

అందుకే, వారు తమకు అవసరమైన సమాచారాన్ని రాసుకోవడం కోసం ఈ నీ బోర్డులను ఉపయోగిస్తారు. కుడి, ఎడమ మోకాళ్లపై వేరు వేరు విషయాలు ఉంటాయి. ఎడమ మోకాలిపైన నీ బోర్డు లో చెక్ లిస్ట్, విమానం లో ఏమి చేయచ్చు, ఏమి చేయకూడదు, ఆ విమానానికి సంబంధించిన సాంకేతిక వివరాలు కూడా పొందుపొర్చబడి ఉంటాయి.

rafel 3

కుడి కాలి నీ బోర్డు పై ల్యాండ్ అవ్వాల్సిన ప్లేస్ లు, అందుకు అవసరం అయిన మ్యాప్ లు ఉంటాయి. వారికి కావాల్సిన సమాచారం చేతిలో అందుబాటులో ఉంచుకోవడం కోసమే వారు ఈ నీ బోర్డులను తగిలించుకుంటారు. వారు ఏమైనా రాసుకోవడానికి కూడా ఈ నీ బోర్డులు అందుబాటులోనే అనువుగా ఉంటాయి.


End of Article

You may also like