మీరెప్పుడైనా గమనించారా..? రైల్వే స్టేషన్ లలో ఆగి ఉన్న రైళ్ల ఇంజిన్లు నడుస్తూనే ఉంటారు. వాటిని పూర్తి ఆఫ్ చేయడం అంటూ జరగదు. అయితే, ఇందుకోసం చాలా డీజిల్ ఖర్చవుతు ఉంటుంది. అయినా సరే.. ఇంజన్లను మాత్రం ఆపివెయ్యరు. ఇంత డీజిల్ వృధా అవుతున్నా.. రైల్వే శాఖ రైళ్ల ఇంజిన్ ను ఎందుకు ఆపివేయదో మీరు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.

rail engine 1

డీజిల్ తో నడిచే ప్రతి ఇంజిన్ బ్యాటరీని కలిగి ఉంటుంది.ఇంజిన్ నడుస్తున్నప్పుడు మాత్రమే ఈ బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. ఈ బ్యాటరీ ఛార్జ్ చేయకపోతే రైలు యొక్క లోకో మోటివ్ సిస్టమ్ ఫెయిల్ అయిపోతుంది. మార్గంలో రెడ్ లైట్ వచ్చినప్పుడు లేదా ఏదైనా కారణం చేత రైలు యొక్క డీజిల్ ఇంజిన్ ఆపేస్తే ఇంజిన్ ను తిరిగి ప్రారంభించడానికి 20 నిమిషాలు పడుతుంది. ఇదే కాకుండా, మళ్ళీ రైలుని తిరిగి ప్రారంభించాలి అంటే ఇంకా ఎక్కువ డీజిల్ అవసరం పడుతుంది. అందుకే.. ఇంజిన్ ను మాత్రం రన్ లోనే ఉంచుతారు.

rail engine 2

ఒకవేళ ఇంజిన్ ను ఎక్కువ సేపు ఆపి ఉంచితే.. బ్రేక్ లైన్లను తిరిగి క్రమబద్దీకరించడానికి మరింత ఎక్కువ సమయం పడుతుంది. రైళ్లు, పెద్దవిగా మరియు భారీగా ఉండటంతో, సమర్థవంతంగా ఆపడానికి బ్రేక్ లైన్ పై ఎక్కువ ఒత్తిడి పడుతుంది. ఈ విషయం లో లోకో పైలట్లు ఎప్పుడు రాజి పడరు. ఈ ఒత్తిడి వలన రైలుని తిరిగి ప్రారంభించాలంటే చాలా సమయమే పడుతుంది. మరియు ఎక్కువ డీజిల్ అవసరం అవుతుంది. అందుకే రైల్వే స్టేషన్లలో కానీ, మరే ఇతర కారణాల వలన కానీ అంత తొందరగా రైలు ఇంజిన్ ను ఆపివేయరు.

rail engine 3

మరొక విషయం ఏమిటంటే.. రైలు కదపకుండా కేవలం ఇంజిన్ ను మాత్రమే ఆన్ చేసి ఉంచితే డీజిల్ చాలా తక్కువ ఖర్చు అవుతుంది. అదే ఇంజిన్ ను ఆపివేసి తిరిగి ఆన్ చేయాలి అంటే చాలా ఎక్కువ అవసరం పడుతుంది. దీనికంటే, ఇంజిన్ ను ఆపకుండా ఉండడమే మేలు కదా.. ఇటీవల కాలం లోని రైళ్లకు ఆక్సిలరీ పవర్ యూనిట్ (ఎపియు) సాయం తో ఇంధన వినియోగాన్ని తగ్గిస్తున్నారు. ఈ వ్యవస్థ విమానాలలో కూడా ఉంటుంది. అనవసర డీజిల్ వినియోగాన్ని ఇది తగ్గిస్తుంది.