నీటితో సాయిబాబా దీపాలు వెలిగించారు అని తెలుసు.. కానీ, అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో తెలుసా..?

నీటితో సాయిబాబా దీపాలు వెలిగించారు అని తెలుసు.. కానీ, అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో తెలుసా..?

by Anudeep

సాయిబాబా భక్త సులభుడని అంటుంటారు. ఆయన తన భక్తులు పిలిస్తే పలుకుతాడు. తన భక్తులకు ఏ చిన్న ఆపద రాకుండా అనుక్షణం వెన్నంటే ఉంటాడు. తన భక్తులను ఆయన ఎలా కాపాడుకుంటూ వచ్చాడో చెప్పడానికి ఎన్నో కధలున్నాయి. ఆయన నీటితో దీపాలు వెలిగించారని, చేతితోనే అన్నాన్ని కలియతిప్పారని, వ్యాధులను మాయం చేసారని, ఇలా రకరకాలు గా ఆయన లీలలను చెప్పుకుంటూ.. ఆయనను స్మరిస్తూ ఉంటారు.

Video Advertisement

saibaba 1

నీటితో దీపాలు వెలిగించడం మనకు సాధ్యం అయ్యే పని కాదు. కానీ బాబా మాత్రం వెలిగించారు. అందరు ఆయన లీలలను కీర్తించారే తప్ప.. ఆయన ఇలా ఎందుకు చేశారు అని మాత్రం ఎవ్వరూ ఆలోచించలేదు. ఆయన నీటితో దీపాలు వెలిగించి ఏమని హితబోధ చేసారు..? అని మాత్రం మనమెప్పుడు ఆలోచించుకోలేదు. బాబా షిరిడి లో ఉన్న సమయం లో.. బాబాను నమ్మిన భక్తులందరూ దీపావళి చేసుకోవాలని అనుకున్నారు.

saibaba 2

వారిలో లోయర్ క్యాస్ట్ ప్రజలు కూడా ఉన్నారు. అయితే.. వీరు దీపావళి చేసుకోవడాన్ని ఇతర మతాలవారు తప్పు పట్టారు. హయ్యర్ క్యాస్ట్ కు చెందిన వారు వీరిని దీపావళి చేసుకోనివ్వలేదు. లోయర్ క్యాస్ట్ కు చెందిన పిల్లలు దీపావళి చేసుకోవాలనే కోరికతో.. పిడకలు తయారు చేసి అమ్మారు. వాటిని అమ్మగా వచ్చిన డబ్బుతో నూనె కొనుక్కోవాలని అనుకున్నారు.

saibaba 3

కానీ, హయ్యర్ క్యాస్ట్ వారు మాత్రం వీరికి ఎవరు నూనెను అమ్మకుండా చేసారు. నూనె లేకుండా దీపాలు వెలిగించడం సాధ్యం కాదు కాబట్టి.. వారు దీపావళి చేసుకోలేరని హయ్యర్ క్యాస్ట్ వారు భావించారు. లోయర్ క్యాస్ట్ కు చెందిన పిల్లలు దీపాలు వెలిగించలేకపోయామని బాధపడ్డారు. వారి బాధని అర్ధం చేసుకున్న బాబా నీటితో దీపాలు వెలిగించి వారి కళ్ళల్లో ఆనందాన్ని నింపారు.

saibaba 4

ఇక్కడ మనం అర్ధం చేసుకోవాల్సిన నీతి ఏమిటంటే.. భగవంతునికి అన్ని కులాల వారు, మతాలవారు ఒక్కరే. అందరికి భగవంతుడు అనే వారు ఒక్కరే. “సబ్ కా మాలిక్ ఏక్ హై” అన్న సాయి బాబా మాటలను మనం అర్ధం చేసుకోవాలి. సాయిబాబా అయినా, రామదాసు అయినా.. అన్నమయ్య అయినా భగవంతుడు ఒక్కరే అని చాటిచెప్పాడు.

annamayya

అన్నమయ్య కూడా తక్కువ కులం వారిని గుడిలోనికి రానివ్వలేదనే పోరాడాడు. రామదాసు అయినా కూడా తక్కువ కులం వారికి గుడి కట్టించాడు. భగవంతుడు ఒక్కడే అని.. ఆయనకు అందరు సమానమే అన్న విషయాన్ని విస్మరించిన మనం మాత్రం కులం, మతం పేరుతొ వాదులాడుకుంటున్నాం. భక్తి అనే పేరుతొ మూఢనమ్మకాలతో బతకడం కాకుండా.. ఆ భక్తి వలన మనలో జ్ఞానోదయం కలిగేలా మనం ప్రవర్తించాలి.


You may also like