Ads
తాజ్ మహల్ ను ప్రేమకు అపురూప చిహ్నం గా అందరు గుర్తిస్తారు. కానీ దీని వెనుక ఉన్నవన్నీ విషాద గాధలే. ఎన్నో శ్రమలకోర్చి కూలీలు దీనిని నిర్మించారు. ఏ వైపు నుంచి చూసిన తాజ్ మహల్ ఒకేలా కనిపిస్తుంది. అది దీని ప్రత్యేకత. అసలు ఈ నిర్మాణాన్ని కడుతున్నపుడు ఆగ్రా అంతా కరువు తో అల్లాడుతోంది. అది పట్టించుకోకుండా ముంతాజ్ పై ప్రేమ తో షాజహాన్ దీనిని కట్టించాడు.
Video Advertisement
కానీ, దీనిని కట్టించిన తరువాత ఇంతటి అద్భుతమైన కట్టడాన్ని ఎవరు కట్టడానికి వీల్లేదని.. కట్టిన కూలీలందరి చేతులు షాజహాన్ నరికించేసాడట. ఇంత చేసాక, ముంతాజ్ చనిపోయాక షాజహాన్ ముంతాజ్ చెల్లెలిని పెళ్లి చేసుకున్నాడట. అంతటి షాజహాన్ తన చివరి రోజుల్లో ఓ చీకటి గదిలో కూర్చుని తాజ్ మహల్ ను చూస్తూనే మరణించాల్సి వచ్చింది. అంతటి అవసరం ఏమొచ్చిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
షాజహాన్ కు , ముంతాజ్ కు పుట్టిన కుమారుడు ఔరంగజేబు. తాజ్ మహల్ నిర్మాణం పూర్తి అయిపోయిన తరువాత.. ఔరంగజేబు వారసత్వం గా అధికారాన్ని చేజిక్కించుకున్నాడట. గతం లో షాజహాన్ తన తండ్రిని ఏ విధం గా జైలు లో ఉంచి హింసించాడో.. అలానే.. ఔరంగజేబు కూడా షాజహాన్ ను అలానే ఓ చీకటి గదిలో బంధించేసాడట. ఆ సమయం లో ఓ అద్దాన్ని తాజ్ మహల్ ను చూసేందుకు వీలు గా ఏర్పాటు చేయాలనీ కోరాడట. ఆ చీకటి గదిలో ఉన్న షాజహాన్ తన చివరి రోజుల్ని అడ్డం లో తాజ్ మహల్ ను చూస్తూనే గడిపేవాడట.
ఒకరోజు ఔరంగజేబు సవతి తల్లి తండ్రి షాజహాన్ గురించి చెప్పుకొచ్చింది. ఔరంగజేబుని ఎంత గారాబం గా పెంచిన సంగతి చెప్పుకొచ్చింది. దీనితో ఔరంగజేబు కి తండ్రి గుర్తుకు వచ్చి చూడడానికి ఆ చీకటి గదికి రాగా, అప్పటికే షాజహాన్ మరణించాడట.
ఖిన్నుడైన ఔరంగజేబు తల్లి సమాధి పక్కనే, తండ్రి షాజహాన్ కి కూడా కొంచం పెద్దది గా సమాధి కట్టించాడట. తాజ్ మహల్ వద్ద ముంతాజ్ సమాధి పై ప్రతి ఏడాది ఓ రోజు కన్నీటి చుక్క పడుతుంది. ప్రతి సంవత్సరం అదే రోజు, సరిగ్గా అదే సమయానికి ఒక కన్నీటి చుక్క పడుతుంది. అది ఇప్పటికీ వీడని మిస్టరీ నే.
End of Article