షిన్ చాన్ కార్టూన్ షో ను ఇండియా లో ఎందుకు బాన్ చేశారు..?

షిన్ చాన్ కార్టూన్ షో ను ఇండియా లో ఎందుకు బాన్ చేశారు..?

by Anudeep

Ads

షిన్ చాన్ కార్టూన్ షో అందరికి సుపరిచితమే. ఈ కార్టూన్ షో వాస్తవానికి జపాన్ షో. ఈ షో లో షిన్ చాన్ పాత్ర చేసే అల్లరి అంతా ఇంతా కాదు. ఈ కార్టూన్ ని ఇష్టపడేవాళ్ళందరికి షిన్ చాన్ గురించి తెలిసే ఉంటుంది. మొదట్లో ఈ కార్టూన్ షో ఇండియా లో కూడా పాపులర్ అయింది.

Video Advertisement

shinchan

అయితే.. కొన్నాళ్ల పాటు షిన్ చాన్ కార్టూన్ షో ను ఇండియా లో బాన్ చేశారు. ఈ షో 2006 లో మొదటి సారి ఇండియా లో కూడా ప్రసారం అయింది. కానీ, 2008 లోనే ఈ షో ను బాన్ చేసారు. దీనికి కారణం ఈ షో లో ఉన్న అడల్ట్ జోక్స్, అడల్ట్ కంటెంట్ వంటివే. ఈ షో లో షిన్ చాన్ పాత్ర వయసు లో చిన్న పాత్ర అయినప్పటికి చేసే పనులు మాత్రం అడల్ట్స్ చేసే పనులు చేస్తూ ఉంటుంది.

shinchan 2

తల్లి తండ్రుల మాటను వినకపోవడం, చిన్నపిల్లలు చూడకూడని కంటెంట్ ను చూపించడం, షిన్ చాన్ చిన్న వయసు వాడే అయినా పెద్ద అమ్మాయిలకు లైన్ వేయడం వంటి పనులు చేస్తూ ఉంటాడు. ఈ క్యారెక్టర్ ఇలా ఉంటె.. ఈ షో ను చూసిన పిల్లలు కూడా అలానే తయారవుతారన్న ఉద్దేశం తో ఈ షో ను ఇండియా లో బాన్ చేసారు. ఆ తరువాత చాలా ఎడిటింగ్స్ చేసి.. ఈ షో ని ప్రసారం చేయడానికి అనుమతినిచ్చారు.


End of Article

You may also like