లంచం తీసుకున్న తరువాత పింక్ కలర్ బాటిల్స్ లో చేతులని ఎందుకు ముంచుతారు..? అసలు కారణం ఇదే..!

లంచం తీసుకున్న తరువాత పింక్ కలర్ బాటిల్స్ లో చేతులని ఎందుకు ముంచుతారు..? అసలు కారణం ఇదే..!

by Anudeep

Ads

లంచం తీసుకోవడం, ఇవ్వడం రెండూ నేరమే. కానీ, అది తెలిసినా కూడా కొన్ని చోట్ల లంచం ఇవ్వడం, తీసుకోవడం జరుగుతూనే ఉంది. కొంతమంది లంచగొండి అధికారులు పనులు పూర్తి చేయడానికి లంచం డిమాండ్ చేస్తూ ఉంటారు. వీరిపై ఎసిబి అధికారులు నిఘా వేస్తూనే ఉంటారు.

Video Advertisement

అయితే మీరెప్పుడైనా గమనించారా? లంచం తీసుకునేటప్పుడు ఎసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నప్పుడు ఆ వార్త అన్ని న్యూస్ ఛానెల్స్ లోను వస్తుంది. అప్పుడు ఈ కింద ఫొటోలో చూపించినట్లు డబ్బుతో పాటు పక్కన పింక్ కలర్ ద్రావణాన్ని కూడా మనం చూస్తూ ఉంటాం.

pink bottles 1

అసలు ఈ ద్రావణం ఎందుకు ఉంచుతారు..? లంచం తీసుకునేటప్పుడు ఈ ద్రావణంతో పనేంటి అన్న సందేహం కలుగుతూనే ఉంటుంది. ఇప్పుడు దీని వల్ల ఉపయోగం ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు ఎవరైనా వ్యక్తిని లంచం ఇవ్వాలని ఓ అధికారి డిమాండ్ చేస్తే.. సదరు వ్యక్తి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసినప్పుడే ఈ విషయం బయటపడుతుంది. అప్పుడు పోలీసులు అధికారికి అనుమానం రాకుండా సదరు వ్యక్తి ఇవ్వబోయే డబ్బుపై ఫినాల్ప్తలీన్ పౌడర్ ను చల్లుతారు. ఇది పైకి కనిపించదు. కానీ డబ్బు తీసుకున్న వ్యక్తి డబ్బుని లెక్కిస్తున్నప్పుడు అతని వేళ్ళకి అంటుకుంటుంది.

pink bottles 2

సదరు వ్యక్తి డబ్బు ఇవ్వగానే, ఏసీబీ అధికారులు రంగ ప్రవేశం చేస్తారు. వారు అధికారి చేతులను సోడియం కార్బోనేట్ కలిపిన నీటిలో చేతులని ముంచాలని చెబుతారు. సోడియం కార్బోనేట్ ను మనం వాషింగ్ సోడా అని కూడా పిలుస్తాం. అయితే, ఫినాల్ప్తలీన్ పౌడర్ అంటుకుని ఉన్న చేతులను ఈ నీటిలో ముంచడం వలన ఆ నీరు పింక్ కలర్ లోకి మారుతుంది. సోడియం కార్బోనేట్ అనేది ఆల్కలైన్ ద్రావణం. అందుకే పింక్ కలర్ ఏర్పడుతుంది. ఈ పింక్ కలర్ వాటర్ ను కోర్టులో సాక్ష్యంగా చూపించి లంచగొండి అధికారికి శిక్ష పడేలా చేస్తారు.


End of Article

You may also like