Ads
మాంసాహారంలో చేపలకు ప్రత్యేక స్థానం ఉంది. చేపలలో మంచి పోషకాలు లభిస్తూ ఉంటాయి. అందుకే ఆరోగ్యంపై శ్రద్ధ కనబరిచే వారంతా చేపలను తమ ఆహారంలో భాగం చేసుకుంటూ ఉంటారు.
Video Advertisement
అయితే.. చేపలు తినే విషయంలో ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు. నేడు మృగశిర కార్తీక. ఈరోజు చేపలను కచ్చితంగా తినాలని చెబుతుంటారు. పట్టణాల్లో సంగతి ఎలా ఉన్నా.. పల్లెల్లో మాత్రం ఈ సందడి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది.
మృగశిర కార్తీక వచ్చిందంటే చాలు.. ఆ రోజు చేపలు తినాలి అంటూ పల్లెల్లో సందడి మొదలువుతోంది. రోడ్లపై చేపల అమ్మకాలు సాగుతుంటాయి. మృగశిర మాసం తొలిరోజునే మృగశిర కార్తీక అని పిలుస్తుంటారు. ఈరోజు చేపలను తినడం ఆరోగ్యానికి మంచిది అని చెబుతుంటారు. తాత ముత్తాతల కాలం నుంచి మృగశిర కార్తీక రోజు చేపలను తింటుండడం ఆనవాయితీగా వస్తోంది. ఈరోజునే కొన్ని చోట్ల చేప మందు ప్రసాదాన్ని కూడా పంపిణి చేస్తుంటారు.
అనాది కాలంగా ఈ పద్దతిని ఎందుకు అవలంబిస్తున్నారు? మృగశిర కార్తీక రోజున చేపలను తినాలని ఎందుకు చెబుతారో తెలుసా..? దీని వెనుక పెద్ద కారణమే ఉంది. సహజంగా రోహిణి కార్తె లో ఎండలు మండిపోయి ఉంటాయి. తరువాత మృగశిర కార్తె మొదలైనప్పటి నుంచి వాతావరణంలో ఉన్నట్లుండి మార్పులు చోటు చేసుకుంటాయి. వాతావరణం చల్లబడి వర్షాలు కురుస్తుంటాయి. దీనివల్ల శరీరంలో వేడి తగ్గిపోతుంది. అందుకే శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించడం కోసం చేపలను తినాలని చెబుతుంటారు. ఇక ఆస్తమా పేషంట్లకు కూడా చేపలు మంచి ఆహారమని చెబుతుంటారు.
End of Article