Ads
మనం ఏ దేవాలయానికి వెళ్లినా తీర్ధం తీసుకోవడం సర్వ సాధారణం. అయితే మనకు తీర్ధం ఇచ్చే పూజారి మూడు సార్లు ఉద్దరిణె తో తీర్ధాన్ని ఇస్తారు. ఒకదాని తరువాత ఒకటి చొప్పున మూడు సార్లు తీర్ధం తీసుకోవడం ఉత్తమ మైన పధ్ధతి. అలాగే, మనం తీర్ధం తీసుకునేటపుడు మన ఎడమ చేతిని కింద ఉంచి కుడి చేతిని పైన ఉంచి తీర్ధం తీసుకుంటాం. ఇలా ఎందుకు చేస్తామో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
Video Advertisement
మనం ఏ దేవాలయానికి వెళ్లినా.. ఆ దేవుడు/దేవత అనుగ్రహం కోసం తప్పక వారి తీర్థప్రసాదాలను తీసుకోవాలి. రోగ నివారణ, పాపాల నివారణ, అకాల మృత్యువు ను తప్పించగల సామర్ధ్యాలు తీర్ధానికి ఉంటాయి. అందుకే ఏ గుడికి వెళ్లినా తీర్ధం తప్పనిసరిగా తీసుకోవాలని చెబుతుంటారు.
” అకాల మృత్యు హరణం, సర్వ వ్యాధి నివారణం…
సమస్త పాప క్షయకరం , శ్రీ పరమేశ్వర పాదోదకం..!”
అన్న ఈ శ్లోకం మన పురాణాల్లోని చెప్పబడింది. ఈ శ్లోకమే తీర్ధం యొక్క మహాత్మ్యాన్ని వివరిస్తుంది. ఇంతటి గొప్ప తీర్ధాన్ని మనం ఎంతో పవిత్ర భావం తో తీసుకోవాలి. అందుకే మన కుడి చేతిని పైన పెట్టి చూపుడు వేలును, బొటన వేలుని మడవాలి. అపుడు గోముఖం ముద్ర వస్తుంది. ఇలా మడవడం వలన నుదుటిపై ఉండే బ్రహ్మరంధ్రము, కంటి తాలూకు నరాలు, మెడ నరాలు తాకుతాయి. తద్వారా చైతన్యం సిద్దించి తీర్ధం యొక్క ప్రభావం మనపై ఉంటుంది.
అలాగే, తీర్ధాన్ని ఇదే పద్దతి లో మూడు సార్లు తీసుకోవాలి. మొదటి సారి తీసుకోవడం వలన శారీరక, మానసిక శుద్ధి కలుగుతుంది. అలానే, రెండో సారి తీసుకుంటే ధర్మం, న్యాయ పరివర్తనలు అలవడతాయి. మూడవ సారి తీసుకోవడం వలన ఆ పరమేశ్వరుని పరమపదం లభిస్తుంది. తీర్ధాన్ని తీసుకునే సమయం లో ఆ దేవ దేవుని తలుచుకుంటూ ఎంతో పవిత్రమైన భావం తో తీసుకోవాలి.
చాలా మంది తీర్ధం తీసుకున్న తరువాత తలకు తుడుచుకుంటూ ఉంటారు. కానీ , ఇది చాలా తప్పు. తలపై బ్రహ్మదేవుడు కొలువై ఉంటాడు. మనం తీర్ధం తీసుకుని తలకు అడ్డుకోవడం వలన మన ఎంగిలి తగిలించినట్లు అవుతుంది. ఇది చాలా తప్పు. తీర్ధం తీసుకున్నాక కళ్ళకు అద్దుకుంటే చాలు. తీర్ధం తీసుకోవడం మనలో సద్భావనను కలిగించేలా చేస్తుంది. అందుకే దేవాలయాలకు వెళ్ళినపుడు తీర్ధం తీసుకోవడం మాత్రం మరువవద్దు.
End of Article