“సైలెన్సర్” లను బైక్ కి కుడి పక్కనే ఎందుకు పెడతారో తెలుసా.? ఎడమ పక్కన ఎందుకు పెట్టరంటే.?

“సైలెన్సర్” లను బైక్ కి కుడి పక్కనే ఎందుకు పెడతారో తెలుసా.? ఎడమ పక్కన ఎందుకు పెట్టరంటే.?

by Mounika Singaluri

Ads

మనం మోటార్ బైక్ ని చూసుకున్నట్లయితే బైక్ కి సైలెన్సర్ కుడిపక్క ఉంటుంది. సాధారణంగా ఏ బైక్ ని చూసినా సరే సైలెన్సర్ అనేది కుడి పక్కన పెడతారు. అయితే ఎందుకు మోటార్ సైకిల్ కి కుడి పక్కన సైలెన్సర్ ని పెడతారు..? ఎడమ పక్కకి ఎందుకు పెట్టకూడదు అనే సందేహం చాలా మందిలో ఉంటుంది.

Video Advertisement

మీకు కూడా ఎప్పుడైనా ఈ అనుమానం వచ్చిందా..? అయితే మరి ఇప్పుడే క్లియర్ చేసుకుందాం. నార్మల్ గా మోటార్ బైక్లు అన్నీ అలానే డిజైన్ చేస్తూ ఉంటారు. అయితే అన్ని కంపెనీలు కుడిపక్కనే ఎందుకు పెడతారు..?

నిజానికి కుడి పక్కకి సైలెన్సర్ ని పెట్టడం వెనుక కొన్ని కారణాలు వున్నాయి. ఈ కారణాలు చూస్తే ఎందుకు కుడిపక్కనే పెడతారో మనకు తెలిసిపోతుంది. ఎడమవైపు అందరూ నడుస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి సైలెన్సర్ పొగ కాని సైలెన్సర్ కానీ ప్రమాదంగా మారకూడదని కుడి పక్కన పెట్టడం జరుగుతుంది.
అలానే చాలామంది మహిళలు మరియు పెద్దవాళ్ళు ఒక పక్క కూర్చుంటూ ఉంటారు. అయితే అలా ఎడమపక్క కూర్చున్నప్పుడు సైలెన్సర్ కుడి పక్క ఉంటే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. అందుకనే సైలెన్సర్ ని ఎడమ పక్కకి పెడతారు.

Also Read:  ప్రామిస‌రీ నోట్ రాసేటప్పుడు ఈ 10 విషయాలు తప్పక గుర్తుపెట్టుకోవాలి…లేదంటే అప్పు ఎగ్గొట్టినా ఏం చేయ‌లేరు.!

అదే విధంగా ఎడమ వైపు చైన్స్ స్ప్రాకెట్ ఉంటుంది. కుడి పక్కన సైలెన్సర్ పెడితే బరువు బ్యాలెన్స్ గా ఉంటుంది. అందుకే సైలెన్సర్ కుడి పక్కకి ఉంటుంది.
అలానే మనం బండి బ్రేక్ వేసి ఆపాలని అనుకున్నప్పుడు జనరల్ గా ఎడమ పాదం ఫుట్ రెస్ట్ మీదకి ముందు వస్తుంది.

దీంతో మనకి సైలెన్సర్ పోగ కానీ వేడిగా తగలడం కానీ జరగదు.
అయితే ఎడమ పక్కకు ఉండకూడదు.. కుడి పక్కనే ఉండాలి అన్నది ఏమీ లేదు. ఎందుకంటే స్పోర్ట్స్ బైక్ కి రెండు పక్కల సైలెన్సర్ ఉంటాయి. అలానే కొన్ని బండ్లకైతే సీట్ కింద ఉంటాయి. కానీ ఎక్కువగా మాత్రం కుడి పక్క మాత్రమే ఉంటాయి.

Also Read:  బ్రాండెడ్ వి కొనేటప్పుడు… నకిలీదో కాదో తెలుసుకోడానికి 7 విషయాలను గుర్తుపెట్టుకోండి.!


End of Article

You may also like