సిమ్ కార్డుకు ఒక వైపు ఎందుకు కట్ చేసి ఉంటుంది..? అసలు కారణం ఇదే..!

సిమ్ కార్డుకు ఒక వైపు ఎందుకు కట్ చేసి ఉంటుంది..? అసలు కారణం ఇదే..!

by Anudeep

Ads

ప్రస్తుతం నడుస్తున్న కంప్యూటర్ యుగం లో సిమ్ కార్డు ఎంత అవసరం ఉన్నదో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఐతే, మీరెప్పుడైనా గమనించారా..? ఏ కంపెనీ సిమ్ కార్డు అయినా సరే కార్డుకి ఒక ఎడ్జ్ వైపు కట్ చేసి ఉంటుంది. ఐతే ఇలా ఎందుకు ఉంటుందో అన్న అనుమానం మీకెప్పుడైనా వచ్చిందా..?

Video Advertisement

sim card 1

ఫోన్ లు వచ్చిన మొదట్లో సిమ్ కార్డులను విడిగా అమ్మేవారు కాదట. ఫోన్ లతో పాటే సిమ్ కూడా అందులో ఉండేది. ఏ మొబైల్ సర్వీస్ కావాలో ముందుగానే అనుకుని.. వారు ఇస్తున్న మొబైల్ ను మాత్రమే తీసుకోవాల్సి వచ్చేదట. ఒకవేళ సర్వీస్ ను మార్చాలి అనుకుంటే.. ఆ ఫోన్ ని వదిలేసుకొని కొత్త ఫోన్ కొనుక్కోవాల్సి వచ్చేది. ఇది రాను రాను సమస్య అవుతుండడం తో సిమ్ కార్డు ను వేరు గా తయారు చేసి అమ్మడం ప్రారంభించారు.

sim card 3

అప్పటి నుంచి సిమ్ కార్డు ను కొనుక్కుని ఫోన్ లో వేసుకోవడం అలవాటు అయిందట. ఐతే.. ఈ సిమ్ కార్డు లు వచ్చిన కొత్తల్లో ఎటువంటి కట్ లేకుండా ఎటువైపు చూసినా
ఒకేలా ఉండేవట. దీనితో సిమ్ కార్డు కొనుక్కున్న వారందరు వేసుకోవడానికి కన్ఫ్యూజ్ అయ్యేవారట. దీనితో మొబైల్ సంస్థలు కూడా కొంతమంది ఉద్యోగులను పెట్టి సిమ్ కార్డు వేసుకోవడం పై తర్ఫీదు కూడా ఇచ్చాయట. అయినప్పటికీ ఫలితం లేదు.

sim card 2

సిమ్ కార్డు వేసుకునే విషయమై.. చాలా మందికి సందేహాలు వస్తుండడం తో పరిష్కారం ఆలోచించారట. అప్పుడు సిమ్ కార్డు కు ఒక వైపు చిన్న కట్ పెట్టి.. ఆ కట్ బయటకు వచ్చే విధం గా పెట్టుకోవాలి అని సూచిస్తూ.. మొబైల్స్ పై కూడా ఆ మార్క్ ఉంచడం స్టార్ట్ అయింది. అప్పటికి కానీ ఈ సమస్య పరిష్కారం అవ్వలేదు. అందుకే.. అప్పటి నుంచి వస్తున్న సిమ్ కార్డ్స్ అన్నిటికి సైడ్ న ఒక కట్ ఉంటుంది. అదన్నమాట సంగతి.


End of Article

You may also like