మన దగ్గర కొంతమంది టూరిస్ట్స్ తో ఎందుకు ఇలా చేస్తారో.? విదేశీయుల ముందు పరువు తీస్తున్నారుగా.?

మన దగ్గర కొంతమంది టూరిస్ట్స్ తో ఎందుకు ఇలా చేస్తారో.? విదేశీయుల ముందు పరువు తీస్తున్నారుగా.?

by Anudeep

Ads

మేరా భారత్ మహాన్ అని గొప్ప గా చెప్పుకుంటూ ఉంటాం కదా.. కానీ.. ఇంతటి మహోన్నతమైన భారత్ లో కూడా కొన్ని కొన్ని మచ్చుతునకలు ఉండనే ఉన్నాయి. మన దేశ గొప్పదనం గురించి పుస్తకాల్లోనో.. ఇంటర్నెట్ లోనో చదివే కొందరు.. ఈ దేశాన్ని చూడాలని.. పర్యటించాలని ఎన్నో ప్రయాసలకోర్చి ఇక్కడకు వస్తూ ఉంటారు.

Video Advertisement

1 foreigners

వారు ఇక్కడ ఉండేది కొన్ని రోజులే అయినా.. వారి నుంచి కూడా మనవాళ్ళు దోపిడీ చేయడం మానరు. అందుకు ఉదాహరణ గా ఓ కోరా యూజర్ ఇలా తెలిపారు. దగ్గర్లో ఓ ప్లేస్ కి వెళ్ళడానికి ఓ టాక్సీ ని పిలిచాడట. అతను దగ్గర్లోని ప్లేస్ కి వెళ్ళడానికి ఎంత అవుతుందో చెప్పాలని కోరగా.. 50 రూపాయలని తెలిపాడు. అదే సమయం లో మరొక ఫారినర్ ఆ టాక్సీ అతని వద్దకు వచ్చి.. తాను ఏ ప్లేస్ కి వెళ్లాలని అడిగాడో అదే ప్లేస్ ని అడిగాడట.

foriengners 2

అయితే.. ఆ టాక్సీ డ్రైవర్ అందుకు 300 ల రూపాయలు అవుతుందని చెప్పాడు. దీనితో షాక్ అవడం ఇతనివంతైంది. కొందరు ఇండియన్స్ కి ఒకలా.. ఫారినర్స్ కి ఒకలా ఛార్జ్ చేస్తూ ఉంటారు..అసలు ఇలా ఎందుకు చేస్తారో..? కొంత సేవ్ చేసుకోవాలి అని అనుకోవడం లో తప్పు లేదు కానీ మరీ ఇంతలా స్వార్ధం గా బిహేవ్ చేయడం మాత్రం తప్పే.

foriengners 3

ఆ కోరా యూజర్ కి సింగపూర్ లో ఓ ఫ్రెండ్ ఉందట. ఆమెను ఎప్పుడైనా ఇండియా కి వచ్చావా..? అని అడిగితె.. అందుకు ఆమె ఏమి చెప్పిందో తెలుసా..? ఒక సారి వచ్చాను.. ఇంకెప్పుడు మళ్ళీ ఇండియాకి రావాలని అనుకోవడం లేదు అని చెప్పిందట. ఎందుకంటే.. ఇండియా చాలా ఎక్సపెన్సివ్ ప్లేస్ అని సమాధానం ఇచ్చిందట. దానికి కారణం మనం పైన చెప్పుకున్న ఉదాహరణ లాంటి సంఘటనలు కోకొల్లలు జరుగుతుండడమే. సింగపూర్ ప్రపంచం లోనే ఎక్స్పెన్సివ్ కంట్రీ.. అలాంటి సింగపూర్ లో నివసించే వారికి ఇండియా ఎక్స్పెన్సివ్ అనిపిస్తోందంటే.. పరిస్థితి ఎలా ఉందో ఆలోచించండి.


End of Article

You may also like