Ads
మీరెప్పుడైనా గమనించారా..? కొంతమంది ఫోన్ లకు కింద భాగం లో రెండు స్పీకెర్ గ్రిల్స్ ఉంటాయి. వాస్తవానికి ఈ స్పీకర్ గ్రిల్స్ అనే వాటిని వాయిస్ వినిపించడం కోసం ఏర్పరుస్తారు. మనం ఏదైనా వీడియో ప్లే చేసినా.. ఫోన్ స్పీకర్ లో పెట్టి మాట్లాడుతున్నా వాయిస్ ఆ స్పీకర్స్ నుంచే వస్తుంది.
Video Advertisement
కొంతమంది ఫోన్ లకు ఈ స్పీకర్ గ్రిల్స్ రెండు ఉంటాయి. కానీ ఒకటి మాత్రం శబ్దం వస్తూ ఉంటుంది. రెండవ దాని నుంచి ఎలాంటి శబ్దం రాదు. దీనిని చూసి చాలా మంది తమ ఫోన్ ఏదో రిపేర్ వచ్చిందనో.. లేక ఒక స్పీకర్ గ్రిల్ పని చేయడం లేదనో భావిస్తూ ఉంటారు. కానీ.. ఇది నిజం కాదు. ఈ గ్రిల్స్ లో వాస్తవానికి ఒక స్పీకర్ మాత్రమే ఉంటుంది.
మరొక చోట మైక్రో ఫోన్ ఉంటుంది. అంటే.. మనం మాట్లాడే మాటలు అవతలి వారికి వినిపించడం కోసం మైక్రో ఫోన్ ఏర్పాటు చేయబడి ఉంటుంది. కొన్ని మొబైల్ కంపెనీలు అయితే.. తమ మొబైల్ డిజైన్ బాగుండడం కోసమే ఇలా రెండు గ్రిల్స్ ను ఏర్పాటు చేస్తాయి. చాలా మందికి ఇది తెలియక మొబైల్ ఫోన్ ఇష్యూ అని అనుకుంటూ ఉంటారు. కానీ అసలు కారణం ఇదన్నమాట.
End of Article