Ads
ఆదివారం వచ్చిందంటే చాలు ఎక్కడ లేని బద్ధకం మనకి వచ్చేస్తుంది. పైగా వారం అంతా కూడా ఆదివారం ఎప్పుడొస్తుందా అని చూస్తూ ఉంటాము. కొంత మంది అయితే ఆదివారం ఫుల్లుగా నిద్రపోవాలని అనుకుంటూ ఉంటారు. మరి కొంత మంది కచ్చితంగా బయటికి వెళ్ళాలి అనో లేదో సినిమా చూడాలనో అనుకుంటారు.
Video Advertisement
ఇలా ఆదివారం పై ఆశలు కూడా ఎక్కువ పెట్టుకుంటుంటారు. నిజానికి ఆదివారం ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు..? సెలవు కాబట్టి అందరికీ ఇష్టమే. అయితే ఎందుకు అసలు ఆదివారం సెలవు దినంగా ప్రకటించారు..?
చాలా మందికి ఈ విషయం తెలియదు. కానీ ఆదివారం కోసం ప్రేమికుడు మాదిరి ఎదురు చూస్తూ ఉంటారు. నిజానికి పురాణాల ప్రకారం ఆదివారం చాలా విశిష్టమైనది. సూర్యుడికి ఆదివారం అంటే ఎంతో ఇష్టం. ఆదివారం నాడు సూర్య భగవానుడికి తర్పణాలు వదిలి నమస్కరించడం వల్ల పుణ్యం కలుగుతుంది. ఆదివారం కనుక సూర్య నమస్కారాలు చేస్తే జ్ఞానం కలుగుతుంది.
అంతే కాదండి ఏదైనా శుభకార్యాన్ని ఆదివారం మొదలు పెడితే తప్పని సరిగా ఏ ఆటంకం లేకుండా పూర్తయి పోతుంది. అయితే పూర్వం బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పాలించే వారు. అప్పటి సమయంలో భారతీయులు ఆదివారానికి ఇచ్చే ప్రాముఖ్యతను చూసి బ్రిటిష్ వాళ్ళు దానిని సెలవు దినంగా ప్రకటించారు.
ఇదిలా ఉంటే అప్పటికే క్రైస్తవ మతాన్ని ఫాలో అయ్యే వాళ్లు ఆదివారం రోజు సెలవు దినంగా ప్రకటించి ఉన్నారు. ఆరోజును విశ్రాంతి దినంగా భావించే వారు. అందువల్లనే ఆదివారం రోజు సెలవు ఇచ్చేవారు. ఇలా క్రమంగా ఉద్యోగులకు, విద్యార్థులకు ఆదివారం సెలవు దినంగా వచ్చింది. మాంసాహారులు కూడా ఆ రోజు తప్పని సరిగా మాంసాహారం వండుకొని తింటారు.
End of Article