Ads
తెలుగు భాష మాట్లాడేవాళ్ళని తెలుగు వారు అని, కన్నడ భాష మాట్లాడేవాళ్ళని కన్నడిగులు అని, గుజరాతి మాట్లాడేవాళ్ళని గుజరాతీయులు అని.. ఇలా భాష ప్రాతిపదికన పిలుస్తూ ఉంటారు. కానీ తమిళులను మాత్రం అరవ వాళ్ళని ఎందుకు అంటారు..? అని ఎప్పుడైనా ఆలోచించారా? తమిళ భాషను “అరవం” అని, తమిళులని “అరవ వాళ్ళు” అని ఎందుకు పిలుస్తారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Video Advertisement
గతం లో మండలం అనే పదాన్ని ఎక్కువ వాడేవారు. ప్రాంతాలను మండలాల ప్రాతిపదికన ఎక్కువ గా గుర్తిస్తూ ఉండేవారు. తమిళనాడు లో కూడా ఇలానే ఉండేది. ఒకప్పుడు మండలాలను రాష్ట్రాల లెక్కన చెప్పుకునేవారు. చోళ మండలం, పాండ్య మండలం..ఇలా ఉండేవి పేర్లు. అలాగే.. తొండై మండలం.. ఇది తమిళనాడు కు చెందినది. ఈ తొండై మండలం లోనే అరువనాడు ప్రాంతం ఉండేది. ప్రస్తుతం నెల్లూరు, చిత్తూరు ప్రాంతాలలో కూడా కొంతవరకు అరువనాడు కిందకే వచ్చేవి.
ఈ ప్రాంతం వారు అరవం మాట్లాడేవారు. ఈ ప్రాంతం తెలుగు రాష్ట్రాలకు అత్యంత దగ్గరలో ఉంది. అందుకే వారి భాష ని అరవ భాష అని, వారిని అరవ వాళ్ళు అని పిలుచుకునేవారు. తెలుగు వారికి సమీపం లో ఉన్న ప్రాంతం అరువనాడు కాబట్టి వారికీపేరు వచ్చింది.
అలాగే.. కన్నడిగులు కూడా వారిని కొంగ అని పిలుస్తారు. దానికి కారణం ఏంటంటే వారికి సమీపం లో ఉన్న ప్రాంతం కొంగునాడు కాబట్టి. అలాగే, మలయాళీలకు పాండ్యనాడు సరిహద్దుల్లో ఉంది కాబట్టి.. వారు తమిళులను పాండీ అని పిలుస్తారు. ఇవి కేవలం చారిత్రాత్మకం గా వచ్చిన పేర్లు మాత్రమే.
End of Article