నిన్న జరిగిన IND Vs PAK మ్యాచ్‌కి… “విజయ్‌” ని ఎందుకు ట్రోల్ చేస్తున్నారు..?

నిన్న జరిగిన IND Vs PAK మ్యాచ్‌కి… “విజయ్‌” ని ఎందుకు ట్రోల్ చేస్తున్నారు..?

by Mohana Priya

Ads

మనం సినిమా నచ్చితే ఏ భాషలో అయినా సరే ఒకేలాగా ఆదరిస్తాం. అందుకే మన భాషలోని సినిమాలు వేరే భాషల్లోకి, వేరే భాషల సినిమాలు మన భాషలోకి డబ్ చేస్తూ ఉంటారు. తెలుగులోకి డబ్ అయ్యే సినిమాలు ఎక్కువగా తమిళ్ భాష నుంచి అవుతాయి. తెలుగులో కూడా విజయ్ క్రేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది.

Video Advertisement

ఇప్పుడు విజయ్ డైరెక్ట్ తెలుగు సినిమా చేస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ హీరోగా నటిస్తున్న వారసుడు సినిమా తమిళ్ తో పాటు తెలుగులో కూడా రూపొందుతోంది. ఈ సినిమా విజయ్ 66వ సినిమా. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవల విడుదల చేసారు. విజయ్ హీరోగా నటించిన బీస్ట్ సినిమా ఈ సంవత్సరం విడుదల అయ్యింది.

నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఫలితం ఆశించిన విధంగా రాలేదు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించారు. సినిమా బాగానే ఉన్నా కూడా తలపతి విజయ్ రేంజ్ సినిమా కాదు అని అందరూ అన్నారు. అలాగే నెల్సన్ దర్శకత్వంలో వచ్చిన మిగిలిన సినిమాలు కూడా తెలుగులో హిట్ అయ్యాయి. దాంతో వాటితో పోలిస్తే ఈ సినిమాలో కామెడీ కొంచెం తక్కువగా ఉంది అన్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమా మొదటిసారిగా నిన్న టీవీలో టెలికాస్ట్ చేశారు. కానీ నిన్ననే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉంది. అసలు ఇలాంటి సమయంలో మిగిలిన ఛానల్స్ వాళ్ళు కొత్త సినిమాలు టెలికాస్ట్ చేసే ఆలోచన కూడా పెట్టుకోరు.

secret message that rohit sent with rishabh pant

కానీ నిన్న జెమిని వాళ్లు మాత్రం ఇవన్నీ ఆలోచించకుండా అంత పెద్ద హీరో సినిమా అది కూడా మొదటిసారిగా టీవీలో రాబోయే సినిమా నిన్న టెలికాస్ట్ చేశారు. దాంతో చాలామంది, “ఇదేంటి రాంగ్ టైంలో సినిమా టెలికాస్ట్ చేశారు?” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ విషయంలో విజయ్ ని కూడా ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు. “అసలు సినిమాని టీవీలో టెలికాస్ట్ చేస్తుంటే అందుకు విజయ్ ఏం చేశారు? సినిమాని ఎప్పుడు టెలికాస్ట్ చేయాలి అనే విషయం ఛానల్ బృందం తీసుకునే నిర్ణయం కదా? అందులో విజయ్ కి సంబంధం ఏముంది? ఎందుకు కామెంట్ చేస్తున్నారు?” అంటూ కామెంట్స్ కూడా వస్తున్నాయి.


End of Article

You may also like